జూలైలో రామ్‌చరణ్‌ ‘ఎవడు’

Ram Charan Nayak Movie Latest Stills, Naayak Movie Photos Pics

రచ్చ, నాయక్‌లతో వరుస సూపర్‌హిట్స్‌తో దూసుకువెళుతున్న మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా, అందాల తారలు శృతిహాసన్‌, అమి జాక్సన్‌లు హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత దిల్‌ రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎవడు’. ఇటీవలే స్విడ్జర్లాండ్‌, బ్యాంకాక్‌లోని లొకేషన్స్‌లో పాటల చిత్రీకరణ పూర్తిచేసుకుని హైదరాబాద్‌కు చిత్ర యూనిట్‌ తిరిగివచ్చారు.

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు & దర్శకుడు వంశీ పైడిపల్లి మీడియాతో మాట్లాడారు.

90 శాతం షూటింగ్‌ పూర్తయింది. విదేశాలలో షూటింగ్‌ పూర్తయింది. మిగిలిన షూటింగ్‌ను లోకల్‌ లొకేషన్లలో జరుపుతాం. జూన్‌ మూడవవారంలో ఆడియో విడుదలచేస్తాం. జులైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ప్రత్యేక పాత్రలో అల్లు అర్జున్‌, కాజల్‌ అగర్వాల్‌లు నటిస్తున్నారు.

నిర్మాత దిల్ రాజు

ఫస్ట్‌లుక్‌ టీజర్‌కు బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఆ ఉత్సాహంతో చిత్రాన్ని మెగా అభిమానులేగాక యావత్‌ ప్రేక్షకులు మెచ్చేవిధంగా రూపొందించాము.

దర్శకుడు వంశీ పైడిపల్లి

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ: వంశీ పైడిపల్లి, వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, కథ, సహకారం: హరి, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, యాక్షన్: సెల్వం, ఆర్ట్: ఆనంద్‌సాయి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

ఈ లెక్కన మేము ఊహించినట్టుగానే పవన్ కళ్యాన్ “అత్తారింటికి దారేది?” కచ్చితంగా ఆగష్టులో రానట్టే.

Filed Under: Mega FamilyFeatured