‘ఎవడు’ రిలీజ్ ఆగష్టులోకి మూవ్ అవ్వడం ఖాయం

ram-charan

దిల్ రాజు నిన్ననే ఎనౌన్స్ చేసాడు ‘ఎవడు’ 90% పూర్తి అయ్యింది, జూలై మూడో వారం రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం అని. ఆ డేట్ ను ఫ్యాన్స్ ఎవరూ నమ్మడం లేదు. ‘ఎవడు’ రిలీజ్ ఆగష్టులోకి మూవ్ అవ్వడం ఖాయం అంటున్నారు. ఆగష్టు 9 న రావచ్చు.

రామ్‌ చరణ్‌, వంశీపైడిపల్లి కాంబినేషన్‌ లో దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘ఎవడు’. ఇటీవలే స్విట్జర్లాండ్, బ్యాంకాక్‌లోని అందమైన లొకేషన్స్‌లో రెండు పాటలు చిత్రీకరణ పూర్తి చేసుకుని హైదరాబద్ చేరుకుంది చిత్ర యూనిట్. శృతి హాసన్ & అమీ జాక్సన్ హీరోయిన్లు.

ఓ ప్రత్యేకమైన పాత్రలో అల్లు అర్జున్, కాజల్ నటిస్తున్నారు. ఓ వైవిద్యమైన కథకి వినూత్నమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా దర్శకుడు వంశీ తీర్చి దిద్దాడని సినీ వర్గాల టాక్.

Filed Under: Mega FamilyFeatured