మెగా అభిమానవిమర్శకుల నోళ్ళు మూయించనున్న ఎవడు

evadu

అభిమానులలో చాలా రకాల అభిమానులు వుంటారు. ఇప్పుడు మూడు కేటగిరిస్ గా విభజిస్తే:

కేటగిరి 1:
సినిమా ఎలా వున్నా తమ అభిమాన హిరో కాబట్టి సినిమా సూపర్ .. మినిమమ్ పది సార్లు చూడాల్సిందే. ఇటువంటి అభిమానుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పవచ్చు.

కేటగిరి 2:
సినిమా నచ్చితే పదిసార్లు చూస్తారు. నచ్చకపోతే కామ్ గా వుంటారు. పొరబాటున కూడా బహిరంగంగా విమర్శించరు. చాలా మంది అభిమానులు ఈ కోవలోకే వస్తారు.

కేటగిరి 3:
మనసుకు అనిపించింది అనిపించినట్టుగానో, కొద్దిగా తెలివి ఉపయోగించి ఇండైరక్ట్ గా బాగోపోతే బాగో లేదని చెప్పేస్తారు. వీళ్ళను మెగా అభిమానవిమర్శకులు అని అందాం.

రచ్చ, నాయక్ వరుస విజయాలతో మెగా అభిమానులందరూ హ్యాపీగా వున్నారు. చరణ్ చిరంజీవి వారసత్వాన్ని కచ్చితంగా నిలబెడతాడనే నమ్మకం వచ్చేసింది.

మెగా అభిమానవిమర్శకులు కూడా హ్యాపీనే, కాని చరణ్ మూస ధోరణిలో కేవలం మాస్ సినిమాలు చెయ్యడం బాగోలేదని బాదపడుతున్నారు. ఎవడు సినిమాతో చరణ్ వాళ్ళ నోళ్ళు మూయించేస్తాడని అంటున్నాయి ఎవడు కథ తెలిసిన ఫిలిం వర్గాలు.

మే 9 న రిలీజ్ అవబోతుందని ప్రచారం జరుగుతున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత .

Filed Under: Mega Family