First Poster Gopala Gopala

gopala gopala 2

పెద్ద సినిమా అంటే అంచనాలు ఎక్కువతో పాటు బడ్జెట్ కూడా ఎక్కువ. దర్శకుడు చెప్పింది ఎలా తీసాడో అనే భయం పెద్ద హిరోల్లో వుంటుంది. అదే రిమేక్ అయితే సినిమా అంతా చూసేసి వుంటారు కాబట్టి, హిరోకు ఒక ఐడియా వుంటుంది.

రిమేక్‌లు అంటే ఇష్టపడే హిరోలు వెంకటేష్ & పవన్‌కల్యాణ్. వెంకటేష్ ఒరిజనల్‌లో హిరో చేసినట్టే చేసి ప్రేక్షకులకు మెప్పిస్తాడు. పవన్‌కల్యాణ్ ఒరిజినల్ గుర్తుకు రాకుండా తనదైన స్టైల్లో చేసి మెప్పిస్తాడు. రిమేక్ విషయంలో భిన్నాభిప్రాయలు కలిగిన వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న రిమేక్ ‘గోపాల గోపాల’. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మోడరన్ శ్రీకృష్ణుడిగా నటిస్తున్నారు. దేవుడిపై కేసు వేసే వ్యక్తిగా నాస్తికుడి పాత్రలో వెంకటేష్ కనిపిస్తారు. “మనం” సినిమాకు అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి అందరి ప్రశంసలు పొందిన అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం ఈ సినిమా మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఓ మై గాడ్’ సినిమాకు ఇది రీమేక్.

gopala gopala

Filed Under: Pawan Kalyan