‘ఫాలో’ ‘ఫాలో’ ‘ఫాలో’ ఎన్టీఆర్ సాంగ్ మేకింగ్

Share the joy
  •  
  •  
  •  
  •  

NTR

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో చిత్రం సంక్రాంతికి సందడి చేయనున్న విషయం తెలిసిందే. అత్తారింటికి దారేది సినిమాలో పవన్‌కల్యాణ్ చేత దేవిశ్రీ ప్రసాద్ పాడించిన కాటమ రాయుడా సాంగ్ మాదిరి, “నాన్నకు .. ప్రేమతో” సినిమాలో యంగ్ ఎన్.టి.ఆర్ పాడిన మేకింగ్ సాంగ్ ను విడుదల చేశారు. గతంలోనూ పలుమార్లు పాటలు పాడిన ఎన్టీఆర్.. మరోసారి ఎనర్జిటిక్ వాయిస్ తో ఈ సాంగ్ ను ఇరగదేసేసిన సంగతి అందరికీ తెలిసిందే. టీజర్ తోనే సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సాంగ్ కు… ఆడియో విడుదలయ్యాక… మరింత క్రేజ్ వచ్చింది. నాన్నకు ప్రేమతో ఆడియోలో ఈ సాంగే హైలెట్ గా నిలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ దగ్గరుండి ఈ సాంగ్ ను ఎన్టీఆర్ చేత పాడించగా.. దర్శకనిర్మాతలు సుకుమార్, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సాంగ్ మేకింగ్ లో సందడి చేశారు.

Filed Under: Featuredనాన్నకు ప్రేమతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *