Good Job Harish Shankar – ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’

harish

సాయిధరమ్ తేజ్, హరీష్ శంకర్, దిల్‌రాజు, ఈ ముగ్గురి కలయికలో రూపొంది, టాలీవుడ్‌లో ప్రస్తుతం అంతటా క్రేజీగా మారిపోయిన సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. హరీష్ శంకర్ స్టైల్లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరక్టర్‌ను ఎంచుకోవడం ఈసారి హరీష్‌శంకర్ పొరబాటు చేసాడని విమర్శల నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ సినిమా కోసం గత రెండు వారాల నుంచే టీమ్ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో ఈ సినిమా అందరినీ అలరించేలా ఉండనుందని ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హరీష్ శంకర్ చెబుతూ వస్తున్నారు. కష్టం అంతా హరీష్‌శంకర్‌దే. Good Job Harish Shankar.

ఇండియాలో ప్రేక్షకులు టాక్‌తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ చూసి సినిమా చూడటానికి రెడీ అయిపొయారు. అమెరికాలో తెలుగుప్రేక్షకులు మాత్రం సినిమా టాక్ కోసం ఎదురుచూస్తున్నారు. వెబ్ రివ్యూస్ బాగుంటే, అమెరికాలో మంచి రెవిన్యూ సాధించే అవకాశం వుంది.

Filed Under: Featuredసుబ్రమణ్యం ఫర్ సేల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *