అమోఘమైన సపొర్ట్

Pawan Kalyan

వేరే హిరోలు
వేరే హిరో అభిమానులు
మీడియా

ఇలా ఒక్కరేమిటి .. ప్రతి ఒక్కరూ “అత్తారింటికి దారేది” సినిమా రిలీజ్ కు ముందే విడియో లీకేజ్‌ను ఖండిస్తూ, నిర్మాతకు ఇస్తున్న సపోర్ట్ అమోఘం.

కబుర్లకే పరిమితం చేయకుండా ఎంతమంది థియేటర్‌లోనే చూస్తారో చూడాలి. రాజకీయాల్లో “సానుభూతి” తో ఓట్లు వెయ్యడం చాలా సార్లు చూసాం. ఈ రకంగా “సానుభూతి” తో సినిమా చూడటం ఇదే మొదటిసారెమో.

అమెరికాలో తగ్గని టిక్కెట్టు రేట్లు:
ఇంగ్లీష్ & హిందీ సినిమాల టిక్కెట్టు రేటు 12 డాలర్లు మించి వుండదు. ఆ రికార్డ్, ఈ రికార్డ్ అని ఇరవై డాలర్ల టిక్కెట్టు ధర పెట్టి తెలుగు ప్రేక్షకులను నిలువ దోపిడి చేసేస్తున్నారు. బొంగులో రికార్డ్స్ కోసం థియేటర్ కు వచ్చి చూసే వాళ్ళ సంఖ్యను తగ్గించేస్తున్నారు. సినిమా హిట్ టాక్ వస్తే ఎంత టిక్కెట్టు ధర అయినా వస్తారు, హిట్ సినిమాపై ఈ టిక్కెట్టు ధర ప్రభావం వుండక పోవచ్చు. సినిమా ఎవరేజ్/ఫ్లాప్ టాక్ వస్తే, రావల్సిన కలక్షన్స్ కూడా రావు. పెద్దలకు 12 డాలర్లు, పిల్లలకు 6 డాలర్లు అయితే, ప్రతి ఫ్యామిలీ సినిమా ఎవరేజ్ టాక్ వచ్చినా వస్తారు.

Filed Under: Pawan KalyanFeatured