గుడ్ టైమ్ vs బ్యాడ్ టైమ్

ramayya-vasthavayya-attarintiki-daredi-647x450

అత్తారింటికి దారేది సినిమా అసలు రిలీజ్ అవుతుందా లేదా అని అందరూ అందోళన చెందుతున్న టైమ్‌లో 90 మినిట్స్ ప్రింట్ లీక్ అవ్వడం, హడావుడిగా సినిమా రిలీజ్ చెయ్యడం, సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం, అన్నీ అలా ఇలా జరిగిపొయాయి. గుడ్ టైమ్. సినిమాలో వున్న నెగిటివ్స్ కూడా పాజిటివ్‌గా చెప్పుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తిగా సఫలీకృతుడయ్యాడని అన్నారు.

యంగ్ ఎన్.టి.ఆర్ కు, గబ్బర్ సింగ్’ లాంటి సంచలన విజయం దక్కించుకున్న హరీష్ శంకర్, దిల్ రాజు నిర్మాణ సారధ్యం & ఇటీవల కాలంలో వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న సమంత కలిసిన సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’ గ్యారంటీ హిట్ అనుకున్నారు కాని, బ్యాడ్ టైమ్.సినిమాలో వున్న పాజొటివ్స్ కూడా నెగిటివ్‌గా చెప్పుకుంటున్నారు. హరీష్‌శంకర్ పూర్తిగా విఫలమయ్యాడని అంటున్నారు.అసలు నమ్మబుద్ది కావడం లేదు.

‘రామయ్యా వస్తావయ్యా!’ అనే ఈ టైటిల్‌ చూసి ఇదేదో కుటుంబ కథా చిత్రమనో, ఆ రకమైన కోవకు చెందిన సకుటుంబ వినోదమనో వెళితే, ప్రేక్షకులు తీవ్రమైన నిరాశకు గురవుతారు. సినిమా పూర్తిగా చూశాక, నిరాశకే కాదు అసంతృప్తికీ, అంతకు మించిన ఆవేశానికీ లోనవుతారు. ప్రాథమికంగా ఇది పగ, ప్రతీకారాల ఫార్ములా కథ. ఇలాంటి కథలు ఇప్పటికే ఎన్నో వచ్చేశాయి. ఆ మధ్య వచ్చిన ‘బన్నీ’ లాంటివి తాజా ఉదాహరణ. మళ్ళీ అలాంటి కథనే, ‘గజిని’ చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ హీరోయిన్‌ లాంటి అంశాలతో వండి వడ్డించారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. సినిమా నిండా నరుక్కోవడాలు, చంపుకోవడాలతో రెండు మ్ముప్పావు గంటల్లో ఎక్కువగా హింసనే పండించారు.

రెంటాల జయదేవ

‘ట్రెండ్ ఫాలోకాను.. క్రియేట్ చేస్తాను’ అంటూ గబ్బర్ సింగ్ లో అదరగొట్టిన దర్శకుడు హరీష్ శంకర్ .. రామయ్యా వస్తావయ్యా లాంటి మూస కథను ఎందుకు ఎంచుకున్నాడో అర్ధం కాదు. ఎప్పుడో 80 దశకాల్లో వర్కవుట్ అయ్యే కథ ప్రస్తుత ట్రెండ్ కు ఎలా సరిపోతుందనేది అర్ధం కాని విషయం. పగ, ప్రతీకారం ఎలిమెంట్స్ తో ప్రేక్షకులతోపాటు, సినిమాని కూడా నలిపేశాడు. గబ్బర్ సింగ్ కు ముందు యావరేజ్ దర్శకుడిగా బ్రాండ్ ఉన్న హరీష్… తన రేంజ్ అదేనని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడా అనిపించింది. ఎన్టీఆర్ ఎనర్జీ, సమంత, శృతి హసన్ గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్, మంచి సంగీతాన్ని అందించిన తమన్ కృషిని, ప్రముఖ నటి రోహిణి హట్టంగడి ప్రతిభను వినియోగించుకోవడంలో హరీష్ శంకర్ పూర్తిగా విఫలమయ్యాడు. వైవిధ్యంలేని కథను ఎంచుకున్న హరీష్ .. తన కథనంతో ప్రేక్షకుడ్ని విసిగించాడు.

మంచి చిత్రాన్ని రూపొందించడానికి పూర్తి స్వేచ్చను ఇచ్చామని చెప్పిన దిల్ రాజు.. కాస్తా కంట్రోల్ చేసి ఉంటే దసరా సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కవుట్ అయ్యుండేది.
రాజబాబు అనుముల
a.rajababu@sakshi.com

అమెరికాలో టిక్కెట్టు రేటు డబుల్ చేసినా “అత్తారింటికి దారేది” సినిమాను ఎగబడి చూసిన జనాలు, “రామయ్యా వస్తావయ్యా” చూడాలని వున్నా డబుల్ టిక్కెట్టు రేటు వలన చూడలేకపొతున్నారు.

Filed Under: Pawan KalyanFeatured