మెగాస్టార్ ఒక మంచి అనుభూతి

Gopi Mohan

చిరంజీవి తన సినిమా కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. తన సినిమాల విషయంలోనే కాదు, తనయుడి సినిమాలో విషయంలో అంతే కేర్ తీసుకుంటున్నాడనడానికి ఈ గోపి మోహన్ ట్వీటే సాక్ష్యం.

Gopi Mohan
మెగాస్టార్ మా స్టోరీ విని తప్పు ఒప్పులని డిస్కస్ చేసిన విధానం,మమ్ముల్ని అభినందించిన విధానం మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి అనుభూతి.

మెగాస్టార్ క్రమశిక్షణ..చిరునవ్వుతో ఎదుటి వారిని పలుకరించే పద్ధతి..ఆయన సహనం..సినిమాకి,టాలెంట్ కి ఆయన ఇచ్చే గౌరవం అమోఘం.మాకు ఒక గొప్ప అనుభవం.

పాజిటివ్‌గా తీసుకుంటే మంచి అనుభూతి. మెగాస్టార్ అనుభవంతో చేసే సూచనలు ఎక్కువ సార్లు మంచి ఫలితాలే వస్తాయి. సినిమా రేంజ్‌ను కచ్చితంగా పెంచుతాయనటానికి మెగాస్టార్ సక్సస్సే సాక్ష్యం.

గోవిందుడు అందరివాడేలే సినిమాతో రామ్‌చరణ్ క్లాస్ ఆడియన్స్‌కు దగ్గరవుతాడనుకుంటే, పాత కథే కావడం వలన అది పూర్తిగా సాధించకపొయినా, మహిళా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ శ్రీనువైట్ల-కోన వెంకట్-గోపి మోహన్ సినిమాతో, రామ్‌చరణ్ కామెడీ టైమింగ్ క్యాచ్ చేస్తాడని మెగా అభిమానులు ఆశీస్తున్నారు.

Filed Under: Mega FamilyTelugu