గ్రీకువీరుడు పరిస్థితి ఏమిటి?

Greeku-Veerudu

పక్కా ఫార్ములా సినిమా తీసి కమర్షియల్ విజయం సాధించడం ఒక ఎత్తు.
వైవిధ్యమైన సినిమా తీసి విజయం సాధించడం మరో ఎత్తు.

రెండు ఎత్తులలోనూ కమర్షియల్ విజయం సాధించడం అంత ఈజీ కాదు. కాని వైవిధ్యమైన సినిమా తీసి విజయం సాధిస్తే ఎక్కువ పేరు వస్తుంది.

నాగార్జున ప్రత్యేకత ఏమిటంటే, ఎక్కువ వైవిధ్యమైన సినిమాలు కమర్షియల్ సాధించడం.

మజ్ను
గీతాంజిలి
శివ
నిన్నే పెళ్ళాడుతా
అన్నమయ్య
మన్మధుడు
శ్రీరామదాసు
షిరిడి సాయి(కమర్షియల్ విజయం సాధించక పోయినా, నాగార్జున ఈ రోల్ చెయ్యడం ఒక అదృష్టం అని సాయి భక్తులు భావిస్తారు)

నాగార్జునకు ఇంకో ప్రత్యేకత కూడా వుంది. చిరంజీవి గారు నెం 1. మేమంతా అయన ఫాలోయర్స్ అని ఓపెన్ గా ఒప్పుకున్న సందర్భాలు చాలా వున్నాయి.

కొత్తతరం వచ్చేసింది. నాగార్జున తనయుడు నాగ చైతన్య సక్సస్ ఫుల్ హిరో అయిపోయాడు. నాగార్జున మరో తనయుడు ‘సిసింద్రీ’ అఖిల్ హిరోగా ఎప్పుడొస్తాడా అని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

“కొత్త తరంతో నాగార్జున పోటీ పడగలడా? గ్రీకువీరుడు పరిస్థితి ఏమిటి?” అని తెలుగు ప్రేక్షకులు అనుకుంటుంటే “yes.. యూ ట్యూబ్‌లో పెట్టిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. యూ ట్యూబ్‌లో ఎక్కువగా యూత్‌ చూస్తున్నారు. అంతా 22 ఏళ్ళ వయస్సున్నవారే. అంకుల్‌ అంటూనే.. ఎలా అందంగా కనబడుతున్నారంటూ.. ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఉదయం 5.30 గంటలకు నిద్రలేచాను. అఖిల్‌ ఫోన్‌ చేశాడు. ఏం చేస్తున్నారు డాడీ.. అంటూ… మీరు.. మీ గడ్డం మీ స్టైల్‌ అంత అందంగా ఎలా కన్పిస్తున్నారు. మా ఫ్రెండ్సంతా మిమ్మల్నే ఫాలో అవుతున్నారంటూ చెప్పాడు.” అని అంటున్నాడు నాగార్జున.

నాగార్జున, నయనతార జంటగా దశరథ్ దర్శకత్వంలో కామాక్షి మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న ‘గ్రీకు వీరుడు’ ఏప్రిల్ 19న విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు .

Filed Under: Extended FamilyFeatured