ఏప్రిల్ నుండి గబ్బర్ సింగ్2

గూగుల్ సెర్చ్ లో దొరికిన ఫొటో

గూగుల్ సెర్చ్ లో దొరికిన ఫొటో

‘అత్తారింటికి దారేది’ భారీ విజయం సాధించినప్పటికీ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభం అదిగో ఇదిగో అంటూ వస్తోంది. జనవరిలో మొదలు అవుతుందనుకున్న గబ్బర్ సింగ్ 2 కథ, కథనాలు ఆశించిన విధంగా తయారవలేదని, పక్కాగా వచ్చాకే స్టార్ట్ చేయాలని పవన్ భావిస్తున్నట్టు వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ నుండి మొదలయ్యే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మార్చి కల్లా పూర్తి చేస్తారని అంటున్నారు.

పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మించే ఈ చిత్రానికి రచ్చ ఫేం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్ ఇంకా ఖరారు కాని ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Filed Under: Pawan KalyanFeatured