Happy Birthday To Powerstar Pawan Kalyan

Pawan-Kalyan-Birthday

పవన్ కళ్యాణ్ కు బర్త్‌డే కూడా మరో సాధారణమైన రోజు మాత్రమే. పవన్ కళ్యాణ్ జరుపుకో పొయినా, ఆయన అభిమానులు మాత్రం ఎదోక మంచి కార్యక్రమం ద్వారా జరుపుకొవడం జరుగుతూ వుంటుంది. ఒకప్పుడు pawanfans.com కూడా ఎదోక మంచి కార్యక్రమాలు చేస్తూ జరుపుకునే వాళ్ళం. ఇప్పుడు మాత్రం ఇలా సైటులో జస్ట్ విషెస్ చెప్పడంతో సరిపెట్టు కుంటున్నాం.

Happy Birthday To Powerstar Pawan Kalyan

పవన్ కల్యాణ్.. ఇవాళ తెలుగు చిత్రసీమను ఏలుతున్న కథానాయకుల్లో అగ్రగణ్యుడు. చిరంజీవి వారసునిగా అడుగు పెట్టినప్పటికీ, అచిర కాలంలోనే తనకే ప్రత్యేకమైన స్టయిల్‌తో యువతరం అభిమాన హీరోగా మారి, ‘ఖుషి’తో అనూహ్యమైన క్రేజ్‌నూ, ఇమేజ్‌నూ సొంతం చేసుకున్నాడు కల్యాణ్. సాహిత్యాభిమాని కూడా అయిన కల్యాణ్‌లో ఉన్న సృజనాత్మక శక్తి ఆయనను దర్శకత్వం వేపు మళ్లించింది. ‘జానీ’తో దర్శకుడుగా మారిన ఆయనకు బాక్సాఫీస్ వద్ద ఎదురుదెబ్బ తగిలినప్పుడు, చాలా కాలం సరైన విజయం ఆయన ఖాతాలో లేనప్పుడు రేసులో కల్యాణ్ వెనుకపడ్డాడని అన్నవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ ఇలాంటి స్థితిలోనూ ఆయన ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదని ‘జల్సా’ నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు సరిగా ఆడకపోయినా ‘గబ్బర్‌సింగ్’తో ఆయన బాక్సాఫీస్ స్టామినా ఏమిటో అందరికీ అర్థమైపోయింది. వసూళ్ల లెక్కల సంగతి అలా ఉంచినా, ఆ సినిమా కల్యాణ్‌కిచ్చిన ఇమేజ్ సామాన్యమైంది కాదు.

ఆయన పేరు వింటేనే యువతరం వెర్రెత్తిపోయేంత ఇమేజ్‌ను ఆ సినిమా ఇచ్చింది. అది రీమేక్ సినిమానే కావచ్చు కాక, అయితేనేం ‘గబ్బర్‌సింగ్’ను ఓ బ్రాండ్‌గా మార్చేశాడు కల్యాణ్.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల కోసం యువతరం ఎదురు చూస్తోంది. సమంత నాయికగా నటించిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. ఇందులోని ‘వీడు ఆరడుగుల బుల్లెట్టూ.. వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ’ అనే పాట ఎలా మారుమోగుతున్నదో చెప్పాల్సిన పనిలేదు. అసాధారణ క్రేజ్ వచ్చిన ఈ సినిమా నిజానికి ఆగస్ట్ 7నే విడుదలవ్వాల్సి ఉంది. కానీ నేడు రాష్ట్రంలో జరుగుతున్న సీమాంధ్ర ఉద్యమం కారణంగా విడుదలను నిరవరధిక వాయిదా వేశారు.

Filed Under: Pawan Kalyan