హరీష్ శంకర్ కు బాగా నచ్చిన సాంగ్

devisriprasad

‘గబ్బర్ సింగ్’ తో మెగా అభిమానులకు దగ్గరైన హరీష్ శంకర్ ‘రామయ్యా వస్తావయ్యా!’ తో నందమూరి అభిమానులకు కూడా ఆప్తుడు కావడం ఖాయం అంటున్నారు. ఆయనలో వున్న మంచి క్వాలిటీ ఏమిటంటే “ఎదుటివారిని మనస్పూర్తిగా మెచ్చుకోవడమే పరిపూర్ణ మైన వ్యక్తిత్వం…” అని నమ్మే వ్యక్తి . పవన్ కల్యాణ్ అభిమాని అని ఓపెన్ చెప్పుకుంటాడు. పవన్ కళ్యాన్ కు ఎంత రెస్పక్ట్ ఇస్తాడో, వేరే హీరోలలో మంచి క్వాలటిస్ కు మెచ్చుకోవడానికి అసలు మొహమాట పడడు. “నిన్ను చూడగానే” బాగా నచ్చి నట్టు వుంది. “చిట్టిగుండె” & “సిరివెన్నల మూటలా వేటూరి పాటలా” అంటూ పవన్ అభిమానులకు రిప్లై ఇస్తున్నాడు.

Full Lyrics of నిన్ను చూడగానే:
నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే

నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే
ఏమిటో ఏమాయో చేసినావే కంటిచూపుతోటి
ఏమిటో ఇదేమిరోగమో అంటించినావే వంటివూపుతోటి
ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా

నిన్ను చూడగానే నా చిట్టిగుండె
నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే

అంతపెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం నీ చేపకళ్ళ లోతుల్లో
ఎట్టా  నింపావే ఇరగదీసావే
భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం
దాన్ని నువ్వు భూమిపైన పెరెగేస్తూ ఇట్టా తిరగేస్తూ తిరగరాసావే
ఏ అలా నువ్వు చీర కట్టి చిందులేస్తే చీమలా నేను వెంటపడనా
నావలా నువ్వు తూగుతు నడుస్తూవుంటే కాపలాకి నేను వెంటరానా
కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాంరావే మరదలా
నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే

ఆహుం ఆహుం ఆహుం ఆహుం
అత్త లేని కోడలు ఉత్తమురాలు ఓరమ్మా
కొడలేలేని అత్త గుణవంతురాలు ఆహుం ఆహుం
ఓయ్ కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓరమ్మా
పచ్చి పాలమీద మీగడేదమ్మా
వేడి పాలలోన వెన్న ఏదమ్మా 

మోనాలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా
ఈ పాలసీసా అందాన్ని చూడనేలేదు ఇంక ఏంలాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తికెళ్ళినోడు రాజైనా
దాని మెరుపు నీలోని దాగి ఉందని తెలియలేపాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే నేనుమాత్రం ఎంతనీ పొగిడి పాడగలనూ
తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను
సిరివెన్నల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావే మరదలా

నిన్ను చూడగానే నా చిట్టిగుండె
నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే

Filed Under: Pawan KalyanFeatured