Hatsoff Allu Family!!!

Share the joy
  •  
  •  
  •  
  •  

allu

Paruchuri GK
ఒక అసత్యం చెబితే బతికినంత కాలం గుర్తు పెట్టుకోవాలి! ఎందుకంటే ప్రతిసారి ఆ అబద్దాన్ని అలాగే చెప్పాలి! నిజం చెప్పిన వెంటనే మర్చిపోవచ్చు

పవన్‌కల్యాణ్ తొలి రోజుల్లో మెగా అభిమానులను అసలు పట్టించుకునేవాడు కాదు. పని పాట లేకుండా ఎందుకు టైంవేస్ట్ చేసుకుంటున్నారానే పాజిటివ్ భావనతో. అలా పట్టించుకొకపొయినా, ఖుషీ సినిమా తర్వాత ఎన్నో ఫ్లాప్స్ వచ్చినా, అభిమానులు అలానే వెంటపడటం చూసి, పవన్‌కల్యాణ్ కూడా మారిపొయాడు. ఇప్పుడు, అభిమానులను తోటి కుటుంబ సభ్యులతో సమానంగా ట్రీట్ చేస్తూ వుంటాడు.

అల్లు అర్జున్- మెగా అభిమానుల రిలేషన్ డిఫరెంట్. మెగా అభిమానులు ఒక పక్క సపోర్ట్ చేస్తునే, మరో పక్క తిట్టడానికి వెనుకాడరు. రామ్‌చరణ్ రాగానే, అల్లు అర్జున్‌ను వెనక్కు తోసేసారు. మగధీర తర్వాత పూర్తిగా ఇగ్నోర్ చేసేసారు.ఇగ్నోర్ చెయ్యడం అంటే అభిమానించకపొవడం కాదు, రామ్‌చరణ్ తర్వాతే అల్లు అర్జున్ అని ఫిక్స్ అయిపొయారు. అల్లు శిరీష్ విషయానికి వస్తే, మెగా అభిమానులే డైరక్ట్‌గా విమర్శించడం మొదలు పెట్టారు. అదెదో అల్లు ఫ్యామిలీ మీద ద్వేషంతో కాదు. మెగాఫ్యామిలి నుంచి వస్తున్న హిరోల సంఖ్య పెరగడం వలన.

మెగా అభిమానుల ప్రవర్తన అల్లు ఫ్యామిలీకి బాగా కోపం తెప్పించినట్టు వుంది. మెగా అభిమానుల ప్రస్తావన లేకుండానే సరైనోడు సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు మెగా అభిమానుల ప్రస్తావన లేకుండానే శ్రీరస్తు శుభమస్తు సినిమా కూడా రిలీజ్ చేసి పబ్లిసిటీ కానిచ్చేస్తున్నారు. Hatsoff Allu Family!!!

హట్సాఫ్ దేనికి?
ప్రపంచం అంతా వర్గమయం. వర్గాలకు అతీతంగా వుండాలంటే ఎంతో పట్టుదల, కష్టం and so on అవసరం.

ఎదో ఒక వర్గాన్ని దువ్వుతూ , వారి అండదండలతో అందరినీ అలరించడం ఒక పద్దతి. రామ్‌చరణ్ పరిస్థితి అదే ఇప్పుడు. తప్పదు. అది తప్పేం కాదు. కారణం ఒక బలమైన వర్గం వాళ్ళు రామ్‌చరణ్‌ను అలా ఓన్ చేసేసుకున్నారు. (వర్గం అంటే కులం కాదు)

బలమైన మెగా వర్గాన్ని దువ్వకుండా, తండ్రి అండతో మెగాస్టార్‌ను మాత్రమే వాడుకుంటూ, వర్గాలకు అతీతంగా తెలుగు ప్రేక్షకులందరినీ అలరించే ప్రయత్నం చేస్తున్న అల్లు బ్రదర్స్ కు కచ్చితంగా హాట్సాఫ్ చెప్పాలి.

Filed Under: Featuredశ్రీరస్తు శుభమస్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *