ఇద్దరమ్మాయిలతో ‘U/A’ సర్టిఫికెట్‌

iddarammayilatho

ganesh bandla ‏@ganeshbandla 24 May
Blockbuster iddarammaailatho got U/A CERTIFICATE THANK U ALL-:))

అల్లు అర్జున్‌, అమలాపాల్‌, కేథరిన్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఇద్దరమ్మాయిలతో..’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. సెన్సార్‌ పూర్తి చేసుకొని ‘U/A’ సర్టిఫికెట్‌ పొందింది. ఈనెల 31న ఈ చిత్రం విడుదలవుతోంది. ట్రైలర్ లో వయలెన్స్ చూసి ‘A’ సర్టిఫికెట్‌ వస్తుందేమో అని మెగా అభిమానులు భయపడ్డారు కాని, రాకుండా బాగానే మేనేజ్ చేసినట్టు వున్నారు.

బన్నీ పెర్‌ఫార్మెన్స్‌, డ్యాన్స్‌, ఫైట్స్‌ అన్నీ ఈ సినిమాకి హైలైట్స్‌ అంటున్నారు. బన్ని ఎంత బాగా చేసినా పూరి టేకింగ్‌, డైలాగ్స్‌ మీదే ఈ సినిమా రేంజ్‌ అధారపడి వుంది.

దేవిశ్రీప్రసాద్‌ ఇచ్చిన ఆడియో మంచి హిట్ అయ్యింది. దేవి రీ-రికార్డింగ్‌ ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ పాయింట్‌. అలాగే కిచ్చా ఫైట్స్‌ గురించి ప్రత్యేకంగావుంటాయట. హీరోయిన్స్‌ అమలాపాల్‌, కేథరిన్‌ ఇద్దరూ యూత్‌ని బాగా ఆకర్షిస్తారని, బ్రహ్మానందంగారి క్యారెక్టర్‌ ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ అవుతుందంటున్నారు.

పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై శివబాబు బండ్ల సమర్పణలో రూపొందిన ఈచిత్రానికి కెమెరా: అమోల్‌ రాథోడ్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Filed Under: Mega FamilyFeatured