ఇద్దరమ్మాయిలతో 3 Days to GO

allu arjun

రామ్ చరణ్ & పవన్ కళ్యాణ్ సినిమాలకు కనిపించిన మెగా అభిమానుల సందడి అల్లు అర్జున్ సినిమాలకు కనిపించదు. ఆ సందడి లోటు కనిపించకుండా, అల్లు అర్జునే స్వయంగా సినిమా పబ్లిసిటీలోకి దిగి తెలుగు ప్రేక్షకులకు థియేటర్స్ కు రప్పించుకుంటాడు. ఇంకో విషయం జాగ్రత్తగా గమనిస్తే అల్లు అర్జున్ ఎనర్జీకి చాలా మంది చిన్న పిల్లలు ఫ్యాన్స్. అల్లు అర్జున్ పాటలు వస్తుంటే పిల్లలు కచ్చితంగా డాన్స్ చేస్తారు.

అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇంకా మూడు రోజుల్లో రిలీజ్ కు సిద్దం అయిన చిత్రం ‘ఇద్దరమ్మాయిలతో’. ఈ నెల 31న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. కాని సినిమా చించి చాట చేస్తుందన్న హైప్ మాత్రం లేకపోవడం ఈ సినిమాకు పెద్ద ప్లస్.

‘ఇడియట్‌’, ‘దేశముదురు’ తరవాత ఓ పూర్తిస్థాయి ప్రేమ కథని తెరపై చూపిస్తున్నారు పూరి. అల్లు అర్జున్ సరసన అమలాపాల్‌, కేథరీన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్‌ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ దీనికి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ

Filed Under: Mega FamilyFeatured