‘ఇద్దరమ్మాయిలతో’ exclusive రివ్యూ

iddarammayilatho

కథ ఏమిటి?
సంజయ్ రెడ్డి పాత్రలో నటించిన అల్లు అర్జున్ స్పెయిన్ లో గిటారిస్ట్ గా ఉంటూ బ్యాండ్ మెయినటైన్ చేస్తుంటాడు. సంగీతం నేర్చుకోవాటానికి వచ్చిన అమలాపాల్ ప్రేమలో పడుతాడు. ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లి సిద్దమవుతారు. పెళ్లి నాలుగురోజులు ఉందనగా అనుకొని సంఘటన వల్ల వీరిద్దరి తల్లిదండ్రులు విలన్ చేతిలో హత్యకు గురువుతారు. వారిపై పగ తీర్చుకునే క్రమంలో క్యాథరిన్ ను ట్రాప్ చేసి ప్రేమలో పడేస్తాడు. నిజం తెలిసిన క్యాథరిన్ ఏం చేసింది. అసలు క్యాథరిన్ లవ్ లో పడేయాల్సిన అవసరం ఏందుకు వచ్చిందన్నదే చిత్రకథ.

సినిమా ఎలా వుంది?
బావుంది.

బావుంటే ఫ్లాప్ టాక్ ఎందుకు వచ్చింది?
అనుకున్నంతలేక పోవడం వలన అనుకుంట. పంచ్ డైలాగులు వున్నాయి, కాని ఇంకా కావాలనుకుంట. నాకైతే ఎక్కడా బోర్ అనిపించ లేదు.

అల్లు అర్జున్ చెప్పినట్టు పూరికి తనమీద ఉన్న ప్రేమే ఈ సినిమా అన్నట్టుగా అనిపించిందా?
స్క్రీన్ ప్లే బావుంది. డైరక్షన్ బాగుంది. స్టోరి నారేషన్ బాగుంది. పూరి జగన్నాధ్ పరంగా చూస్తే లోపాలు ఏమి కనిపించలేదు. ప్లస్ ఈ సినిమాలో అల్లు అర్జున్ హైలట్ గా కనిపిస్తాడు. అల్లు అర్జున్ చాలా ఇంప్రూవ్ అయ్యాడనిపిస్తాడు.

ఎవరికి నచ్చుతుంది? సినిమా చూడచ్చా?
యూత్ కు, మాస్ కు కచ్చితంగా నచ్చుతుంది. మిగతా వాళ్ళు కూడా హ్యాపీగా చూడవచ్చు. టు మచ్ ఎక్సపెటేషన్స్ కాకుండా, మాములుగా చూస్తే ఫస్ట్ నుంచి చివరి దాకా ఫుల్ ఎంటరటైనమెంట్ సినిమా.

Filed Under: FeaturedHari Reviews