కథ ఉన్న సినిమా – ఇద్దరమ్మాయిలతో

alluarjun

అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మించిన ‘ఇద్దరమ్మాయిలతో…’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా “కథ ఉన్న సినిమా – ఇద్దరమ్మాయిలతో” అంటున్నాడు అల్లు అర్జున్.

రెండేళ్ల క్రితం క్యాజువల్‌గా కలిసినప్పుడు ఓ చిన్న పాయింట్ చెప్పారు పూరి. మేమిద్దరం కలిసి చేద్దామనుకున్నప్పుడు ఆ పాయింట్‌ని డెవలప్ చేయమని చెప్పాను. ఆయన డెవలప్ చేసి చెప్పాక ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యాను. సాధారణంగా పూరి సినిమా అంటే కథ తక్కువగా ఉండి స్క్రీన్‌ప్లేకి, డైలాగులకీ ఎక్కువ స్కోప్ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా కథ ఎక్కువగా ఉండి, డైలాగులు కాస్త తక్కువగా ఉండే సినిమా ఇది. ఇందులో డైలాగులు ఉంటాయి. కొన్ని హైపిచ్ డైలాగులతో పాటు కూల్ డైలాగ్స్ ఉంటాయి. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘జులాయి’ తర్వాత ఇందులో బెస్ట్ డైలాగ్స్ ఉన్నాయి.

— అల్లు అర్జున్

Filed Under: Mega FamilyFeatured