ఇద్దరమ్మాయిలతో ‘బాద్ షా’

bunnyntrvatilapuri

ప్రస్తుతం టాక్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ బండ్ల గణేష్. అతి తక్కువ కాలంలో పెద్ద నిర్మాతల లిస్టులో చేరిపోయి, అదే రేంజ్ లో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు.

ఈ సమ్మర్ రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఒకటి ఎన్.టి.ఆర్ తో ‘బాద్ షా’, మరొకటి బన్నీతో ‘ఇద్దరమ్మాయిలతో’. ‘బాద్ షా’ రిలీజ్ డేట్ ఏప్రిల్ 5 కనఫర్మ్ కాగా, ‘ఇద్దరమ్మాయిలతో’ రిలీజ్ డేట్ తెలియవలసి వుంది.

ఈ రెండు సినిమాలు ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు వున్నాయి. ‘ఇద్దరమ్మాయిలతో’ & ‘బాద్ షా’ టీమ్లు కలిసి దిగిన ఫొటో బయటకు వచ్చింది.

‘ఇద్దరమ్మాయిలతో’ దర్శకుడు పూరి జగన్నాద్ & ‘బాద్ షా’ హీరో ఎన్.టి.ఆర్ తో నిర్మాత కె.యస్.రామారావు నిర్మించవలసిన చిత్రం, చివరి నిమషంలో నిర్మాత డ్రాప్ కావడం వలన కాన్సిల్ అయ్యింది. పూరి జగన్నాద్ భారీ రెమ్యునరేషన్ పే చేయగల్గిన నిర్మాత కోసం వెతుకుతున్నట్టు వినికిడి.

‘బాద్ షా’ దర్శకుడు శ్రీను వైట్ల & ‘ఇద్దరమ్మాయిలతో’ హిరో బన్నీ తో గీతా ఆర్ట్స్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు మరో వినికిడి.

Filed Under: Extended FamilyFeatured