ఇద్దరమ్మాయిలతో మే 10th అయితే, ఎవడు ఎప్పుడు?

ఇద్దరమ్మాయిలతో

ఇద్దరమ్మాయిలతో

puri jagan ‏@purijagan
Iddarammayalatho May 10 th release

ఒకరేమో స్టైలిష్ స్టార్, మరొకరేమో జెట్ స్పీడ్ వేగంతో సినిమా పూర్తి చేసి చెప్పిన టైంకి రిలీజ్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్. అల్లు అర్జున్ హీరోగా, పూరి జగన్నాధ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్ర షూటింగ్ ఇప్పుడు స్పెయిన్ లో జరుగుతుంది. అమల పాల్ & కేథరిన్ ఇద్దరమ్మాలుగా నటిస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ప్రారంభ పూజాకార్యక్రమాలు జరిగినపుడు డిసెంబర్ నెలఖారుకు రెడీ చేసి నిర్మాత చేతిలో పెడతానని పూరి జగన్నాధ్ చెప్పాడు కాని, అల్లు అర్జున్ సినిమా క్వాలిటీ కోసం పూరి జగన్నాధ్ స్పీడ్ కు బ్రేక్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే.

all of sudden, ఇద్దరమ్మాయిలతో మే 10th రిలీజ్ అని నిన్న పూరి జగన్నాధ్ ట్విట్ చేసాడు. అది బాగానే వుంది కాని, మే9th రిలిజ్ అని ఎక్సపెట్ చేస్తున్న రామ్ చరణ్ ‘ఎవడు’, ఎప్పుడు అనే ప్రశ్న అభిమానులలో మొదలైంది.

Filed Under: Mega FamilyFeatured