పవన్‌కల్యాణ్ ముందుకు అడుగేస్తాడా? వెనక్కి వచ్చేస్తాడా?

PK

ఏప్రిల్ 27, పవన్ కళ్యాణ్-ఎస్ జె సూర్య కాంబినేషన్ లో వచ్చిన ‘ఖుషి’ సినిమా విడుదలై నేటికి 15 ఏళ్లు. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై హీరోగా తెరకెక్కబోతున్న పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో నిరాడంబరంగా జరిగింది. దేవుడి చిత్రపటాలపై ముహూర్తపు షాట్ తీశారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఎడిటర్ గౌతంరాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఎస్ జె సూర్య మొదటి సన్నివేశాన్ని డైరెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ వైట్ షర్ట్, పంచె కట్టుతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫ్యాక్షన్ లీడర్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. పవన్‌కల్యాణ్ పబ్లిక్‌గా తన నెక్స్ట్ సినిమా అనూప్ రూబెన్స్‌తో చేస్తానని ప్రామిస్ చేసినట్లే, ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించనున్నాడు.

తెలుగుసినిమా స్టామినాను పెంచే దిశగా “సర్దార్ గబ్బర్‌సింగ్” సినిమాను హిందీలో డబ్ చేసి, ఒకే రోజు రిలీజ్ చేసాడు. నిజానికి బాహుబలితో ఇంకా పెద్ద అడుగు వేసి, మాక్సిమమ్ బాషల్లో రిలీజ్ చేసారు. పవన్‌కల్యాణ్‌కు బాహుబలి భారీ రిలీజ్ విషయం తెలిసో తెలియదో కాని, “సర్దార్ గబ్బర్‌సింగ్” తోనే ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇంటర్వ్యూస్‌లో చెప్పాడు. (బాహూశా తన సినిమా ఇలా డబ్ చేసి రిలీజ్ చేసి, తన సినిమా స్టామినా పెంచుకుందామనే వుద్దేశంతో చెప్పివుంటాడు.)

ఈసారి ఇంకో అడుగు వేస్తూ, హిందీతో పాటు, తమిళ్‌లో కూడా రిలీజ్ చేస్తాడా? ఈ కథకు అస్కారం లేదని వంక చూపుతూ, తెలుగుకే పరిమితం అవుతాడా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *