ఇది పవన్ కళ్యాణ్ చెయ్యవలసిన సినిమానా?

vishnu-veeru potla

దేనికైనా రెడీ చిత్రం తర్వాత మంచు విష్ణు కథానాయకుడిగా 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బేనర్‌లో నటిస్తున్న చిత్రం ఆదివారంనాడు తిరుపతి సమీపంలోని చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమైంది. బిందాస్‌, రగడ చిత్రాల ఫేమ్‌ వీరుపోట్ల దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

‘బిందాస్’ ‘రగడ’ ఫేమ్ వీరు పొట్ల సినిమాకు పవన్ కళ్యాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరు పొట్ల ఒక సబ్జక్ట్ తయారు చేసి పవన్ కళ్యాన్ కు వినిపించినట్టు, పవన్ కళ్యాణ్ తనకు సరిపడ సబ్జక్ట్ కాదనడం జరిగిందన్నారు.

ఈరోజు మొదలైన మంచు విష్ణు సినిమా అదే సబ్జక్ట్ మంచు విష్ణుకు అనువుగా మార్చి తీస్తున్నారా?

ఇదే విధంగా హరీష్ శంకర్ రవితేజతో మిరపకాయ్ చేసాడు. ఆ తర్వాత పవన్ కల్యానే పిలిచి హరీష్ శంకర్ తో ‘గబ్బర్ సింగ్’ చెయ్యడం, పెద్ద హిట్ అవ్వడం అందరికీ తెలిసిందే.

ఇదే విధంగా వీరుపొట్ల కూడా తన తర్వాత సినిమా పవన్ కల్యాణ్ తో చేస్తాడేమో. మంచి మాస్ డైలాగ్స్ తో, మంచి ట్విస్ట్స్ తో మంచి మాస్ సబ్జక్ట్ చేయగల సత్తా వున్నా కథా రచయిత వీరు పొట్ల.

విష్ణు సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో డా. బ్రహ్మానందం, కోటశ్రీనివాసరావు, డా. శివప్రసాద్‌, అలీ, ఆహుతిప్రసాద్‌, రావురమేష్‌, మాస్టర్‌ భరత్‌, రవిప్రకాష్‌, వినరుప్రసాద్‌, రజిత, సమ్రాట్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్‌మురారి, స్క్రీన్‌ప్లే: వీరుపోట్ల, గోపీమోహన్‌, కథ, మాటలు, దర్శకత్వం: వీరుపోట్ల, నిర్మాత: డా. మోహన్‌బాబు.

Filed Under: Extended Family