It’s Official: “అత్తారింటికి దారేది?” ఆగష్టు 7 రిలీజ్

Attarintiki-Daredi-Title-confirmed

It’s Official:
పవన్ కళ్యాన్-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా టైటిల్ “అత్తారింటికి దారేది?”. ఆగష్టు 7న సినిమా రిలీజ్. జూలై 19న ఆడియో రిలీజ్. ఫస్ట్ లుక్ & టీజర్ ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు.

కొందరు ఫ్యాన్స్ ఆందోళన:
ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు కాని, కొందరు ఫ్యాన్స్(not me) వారం రోజుల గ్యాప్ లో రెండు మెగా సినిమాలు రిలీజ్ అంటే, రెండు సినిమాల కలక్షన్స్ కు పెద్ద బొక్క అని తెగ బాదపడి పోతున్నారు.

టైటిల్ “అత్తారింటికి దారేది?”:
టైటిల్ సడన్ గా కాకుండా జనాల నోళ్ళల్లో నాన్చి నాన్చి రిలీజ్ చెయ్యడం వలన “బాగుంది” “బాగోలేదు” అని అనడానికి ఏమీ లేదు. కథకు అనుగుణంగా పెట్టారని సర్దుకు పొవడమే.

పైడపల్లి వంశీ:
ఇంతకు ముందు ‘బృందావనం’ సినిమా కూడా అంతే , మహేష్ బాబు ఖలేజ పోటికి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాన్ సినిమా. రెండు సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా ‘ఎవడు’. లాస్ట్ మినిట్ లో పవన్ కళ్యాణ్ సినిమా రూపంలో ఒత్తిడి రావడం కొద్దిగా బాదాకరమైనదే. జూలై 31 నుంచి ఆగష్టు నెలాఖారుకు పోస్ట్ పోన్ చేద్దాం అంటే సెప్టెంబర్ 6న ‘జంజీర్’ వుంది.

రామ్ చరణ్:
రామ్ చరణ్ సినిమా ‘నాయక్’ సంక్రాంతికి మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో పోటి పడి నిలబడ్డాడు, ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ‘ఎవడు’ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది?’ తో పోటి పడవలసిన పరిస్థితి. మహేష్ బాబు సినిమాను ఈజీగా ఎదుర్కొన్న రామ్ చరణ్, పవన్ కళ్యాన్ సినిమాను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. దిల్ రాజు నిర్మాత కాబట్టి, ఈసారి థియేటర్స్ ఎడ్వాంటేజ్ వుంటుంది.

సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారాగణం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్: పీటర్ హెయిన్స్, కళ: రవీందర్, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, రచన, దర్శకత్వం: త్రివిక్రమ్.

Filed Under: Pawan KalyanFeatured