Jill songs far better than S/O sathyamurthy

AD2

వార్తల్లో వుండటానికి మైకు దొరికితే ఏమి వాగుతాడో సృహ తెలియని దాసరిని పిలిచి చాలా పెద్ద తప్పు చేసాడు అల్లు అరవింద్.కాకపొతే అల్లు అరవింద్ ప్రమేయం ఏమీ లేదని, సెంటిమెంట్ ప్రకారమే దర్శకరత్న దాసరి నారాయణరావును ముఖ్య అతిధిగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో విడుదల కార్యక్రమానికి చిత్ర బృందం ఆహ్వానించిందని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కలయికలో హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన “జులాయి” ఆడియో పవన్ కళ్యాణ్, దాసరి చేతుల మీదుగా విడుదలయ్యింది. ఆడియోతో పాటు ఆ సినిమా పెద్ద హిట్టయ్యింది. ఇప్పుడు అదే కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి”. రెండు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. దాంతో ఈ సినిమా ఆడియోకి సైతం వీరిద్దరని అతిథులుగా ఆహ్వానించారు. వ్యక్తిగత కారణాల వలన పవన్ హాజరు కాలేదని సమాచారం. దాసరి ఒక్కడే వచ్చి కార్యక్రమాన్ని కంపు కంపు చేసాడు.

దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ గీతాలు కొత్తదనం ఏమి లేకపొయినా, ఆడియో ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.S/O సత్యమూర్తి కంటే గోపిచంద్ జిల్ సినిమా సాంగ్స్ బాగున్నాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

సమంత, నిత్యా మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, స్నేహ, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాసరావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రేక్షకులలో ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీ హిట్ రేంజ్ సినిమా అవుద్దని ఎక్సపెట్ చేస్తున్నారు.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *