Jyothi Lakshmi Trailer

JyothiLakshmi

మగధీర సినిమాకు ముందు రాజమౌళి కేవలం ఒక మాస్ డైరక్టర్. మగధీర సినిమా ద్వారా మెగా అభిమానుల అభిమానంతో పాటు, తెలుగు ప్రేక్షకులందరికీ ఫెవరెట్ డైరక్టర్ అయిపొయాడు.

పూరి జగన్నాధ్ సినిమాల్లో హిరో క్యారెక్టరైజేషన్ అంటే అందరికీ ఇష్టం, కాని తను చూపించే పైత్యంను తట్టుకొలేరు. ఎన్ని ప్లస్ పాయింట్స్ వుంటాయో, అన్ని నెగిటివ్ పాయింట్స్ వుంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొన్ని నిజాలు పచ్చిగా/నికార్స్‌గా చెప్పే ప్రయత్నం చేస్తూ వుంటాడు.

పూరి సినిమా నచ్చాలంటే ఆ సినిమాకు కనెక్ట్ అవ్వాలి. మన హిరోలకు ఎంత మంది అభిమానులు వున్నారో, ఆ హిరో మీద ఈర్ష్య పడేవాళ్ళు అంతకంటే ఎక్కువ మంది వున్నారు. ఆ విధంగా బిజినెస్‌మేన్ సినిమాలో మహేష్‌బాబు రోల్ ఒక క్యారెక్టర్ అని చూడకుండా, “మహేష్‌బాబు ఏమిటి లేడిస్ మీద ఆ డైలాగ్స్ చెప్పడం ఏమిటి”, బిజినెస్‌మేన్ చెయ్యడం ఒక తప్పిదంగా మహేష్‌బాబు ఈర్ష్య పరులు మాట్లాడుతూ వుంటారు. మహేష్ అభిమానులు మాత్రం ఆ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.

టెంపర్ సినిమాకు ముందు పూరితో సినిమానా అని భయపడిన నందమూరి అభిమానులెందరో వున్నారు. టెంపర్ సినిమా ద్వారా నందమూరి అభిమానుల్లో పూరిపై వున్న అభిప్రాయంలో భారీ మార్పు వచ్చింది.

  1. పూరి జగన్నాధ్ అంటే బద్రి నుంచి పవన్ అభిమానులకు ఇష్టం.ఇడియట్ & పొకిరి సినిమాలు పవన్ కల్యాణ్ చెయ్యలేదని ఎంతో బాదపడుతూ వుంటారు.
  2. పూరి జగన్నాధ్ అంటే మహేష్‌బాబు అభిమానులకు ఇష్టం. ఊహకందరి పోకిరి ఇచ్చాడు.
  3. పూరి జగన్నాధ్ అంటే నందమూరి అభిమానులకు ఇష్టం. టెంపర్ ద్వార సరికొత్త ఎన్.టి.ఆర్ ను చూపించాడు.
  4. “జ్యోతిలక్ష్మి” ద్వారా ఆడవాళ్ళ అభిమానంతో పాటు గౌరవం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Filed Under: Extended FamilyFeaturedTeluguVideos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *