కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ

Share the joy
  •  
  •  
  •  
  •  

Konidela

చిరంజీవి 150వ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. దానిలో భాగంగా ప్రత్యేకంగా ఓ ప్రొడక్షన్‌ను ప్రారంభించాడు. దానికి మొదట చరణ్‌ తల్లి అయిన సురేఖ పేరిట సురేఖ ప్రొడక్షన్‌ అని పెట్టాలనుకున్నాడట. తర్వాత ఆ పేరు ఇప్పుడు మార్చాడు. తన కుటుంబం అందరికీ నచ్చేలా తన ఇంటి పేరు వచ్చేలా ప్రొడక్షన్‌ను పేరును ఖరారు చేశాడు చరణ్‌. అదే ‘కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ’. ఈ ప్రొడక్షన్‌లో చిరంజీవి 150వ చిత్రం నిర్మాణం జరుగుతుందన్నమాట. ఈ ప్రొడక్షన్‌ లోగో కూడా ప్రత్యేకంగా డిజైన్‌ చేయించాడు చరణ్‌. మెగాస్టార్‌ కుటుంబానికి ఇష్టదైవం ఆంజనేయస్వామి. తన ప్రొడక్షన్‌ లోగోలో ఆంజనేయ స్వామి ఉండేలా రూపొందించారు. ఈ సినిమా ఈ రోజు మధ్యాహ్నం 1.30 కి ముహుర్తం కార్యక్రమాలు జరుపుకోబోతున్నది.

సినిమాపై వున్న హై ఎక్సపెటేషన్స్ దృష్ట్యా, తమిళ్‌లో హిట్ అయిన మురుగదాస్”కత్తి” సినిమాను రిమేక్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. రిమేక్ కావడంతో, ఈ సినిమా నుంచి ఏమి ఎక్సపెట్ చేయవచ్చు అనేది స్పష్టం అవుతుంది. ఈ కథ చిరంజీవికి సూట్ అవ్వడానికి ఏమి మార్పులు చేసారనే దాని మీదే సినిమా రేంజ్ ఆధారపడి వుంది.

తనకు కామెండ్ లేని జోనర్‌లో “అఖిల్” సినిమాను తనదైన మాస్ శైలిలో తీసి ఘోరంగా దెబ్బతిన్న వి.వి.వినాయక్, చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు. ప్రత్యేక శ్రద్దతో పనిచేస్తున్నాడు.

చిరంజీవి 150వ సినిమాకు ముందుగా పూరి జగన్నాధ్ కథ & డైరక్షన్ అనుకున్నారు, కాని పూరి జగన్నాథ్ ఈ సినిమాను కూడా సాదాసీదా సినిమాగా ట్రీట్ చేస్తూ ప్రత్యేక శ్రద్ద కనబరచకపొవడంతో, ఆయన అవకాశం కొల్పోయాడు.

Filed Under: ఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *