క్రిష్ ఈసారి ఆ తప్పు చెయ్యడం లేదు

Share the joy
  •  
  •  
  •  
  •  

NBK-Chiru

నట సింహం నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రంగా, గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కెమెరా స్వీచాన్ చెయ్యగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ క్లాప్ , మొదటి సన్నివేశానికి దర్శక రత్న దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయి బాబు సంయుక్తంగా నిర్మిస్తుండగా..దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు.

బాహుబలి సినిమాతో రాజమౌళి 1) సినిమాను ఏ విధంగా హైప్ చెయ్యాలి ? 2) ఏ విధంగా అందరూ ఓన్ చేసుకొనేలా చెయ్యాలి? 3) ఏ విధంగా పబ్లిసిటి చెయ్యాలి? అనె విషయాలు కరెక్ట్ గా చేసి చూపించాడు. అలా చెయ్యడం ద్వారా, అవన్నీ వర్క్ అయితే కలక్షన్స్ ఏ రేంజ్‌లో వుంటాయో అందరికీ తెలిసింది. రాజమౌళిని ఎవరూ ఫాలో అయ్యే ధైర్యం చెయ్యలేదు. పవన్‌కల్యాణ్ సర్దార్ గబ్బర్‌సింగ్ ద్వారా తనదైన స్టైల్లొ రిలీజ్ చేసాడు కాని, సినిమాలో విషయం లేకపొయేసరిని ప్రయత్నం బెడిసి కొట్టింది.

క్రిష్ కంచె చిత్రంకు బాహుబలికి వున్న అన్ని క్వాలిఫికేషన్స్ వున్నాయి. కాని, ఎందుకో అసలు హాడావుడి లేకుండా స్టార్ట్ చేసి, రిలీజ్‌కు ముందు మాత్రమే పబ్లిసిటి చేసాడు. రిలీజ్ కూడా అసలు ప్లానింగ్ లేకుండా చేసి, ఒక మంచి సినిమాను కిల్ చేసేసారు. హిందిలో రిలిజ్ చెయ్యకుండా మరో తప్పు చేసాడు.

గౌతమి పుత్ర శాతకర్ణి హిందిలో డబ్ చేస్తారో లేదో తెలియదు కాని, సినిమాను తెలుగువాళ్ళు అందరూ ఓన్ చేసుకొనేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక అద్భుతమైన సినిమా చేస్తున్నప్పుడు ఈ మాత్రం హైప్ కావాలి. ఆ హైప్‌ను రీచ్ అవ్వగల సత్తా క్రిష్ దగ్గర వుంది. క్రిష్ కంచె సినిమాకు చేసిన తప్పు, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు చెయ్యకపొవడం అభినందనీయం.

Filed Under: Extended Familyగౌతమీపుత్ర శాతకర్ణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *