లేడిస్‌తో పెట్టుకోవద్దు

హైదరాబాద్ సత్యం థియేటర్ దగ్గర టిక్కెట్టు కోసం లైన్‌లో లేడీస్

హైదరాబాద్ సత్యం థియేటర్ దగ్గర టిక్కెట్టు కోసం లైన్‌లో లేడీస్

కథాకథనాల గురించి ఏ మాత్రం ముందుగా తెలుసుకోకుండా, నేరుగా థియేటర్ లో సినిమా చూసి, ఓ అభిప్రాయానికి రావడం అలవాటు. ఈ సినిమాకు అదే పాటిస్తూ, రిలీజ్ రోజు ఉదయాన్నే చూడాలని ప్లాన్. తీరా, అనుకోని వ్యక్తిగత ఇబ్బందులు వచ్చి, ఊరెళ్ళాల్సి వచ్చింది. ఆర్టీసీ బంద్ ల మధ్య ప్రయాణం ఖరీదై, ప్రాణానికి నరకంగా మారిన పరిస్థితుల్లో అనివార్యంగా సినిమా చూడడం రెండు రోజులు ఆలస్యమైంది. ఎట్టకేలకు సినిమా చూశాను – ఎవరి నుంచీ కథ, ఇతర వివరాలు కనుక్కోకుండా.

తీరా సినిమా చూశాక, ఇది త్రివిక్రమ్ మార్కు సినిమాయేనా అనిపిస్తుంది. ఇప్పటికే, గతంలో రచయితగా, దర్శకుడిగా నువ్వు నాకు నచ్చావ్, అతడు, జల్సా లాంటి ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు ఇచ్చిన అతనికి ఈ సినిమా ప్రమోషనా, డిమోషనా అన్న సందేహం వస్తుంది. ఆశించిన అద్భుత విజయం అందీ అందకుండా ఊరిస్తున్నప్పుడు ఏ దర్శక, రచయిత అయినా దాని కోసం ఎన్ని రకాలుగా మార్కెట్ లో ఉన్న సక్సెస్ సూత్రాలను తానూ అనుసరిస్తాడో అర్థమవుతుంది. వెరసి, ఈ సినిమాను ‘అత్తారింటికి దారేది…’ అని కాకుండా, ‘అపూర్వ విజయానికి దారేది…’ అని అనుకొని మరీ, ఆ చట్రంలో డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది.

–రెంటాల జయదేవ

హై ఎక్సపెటేషన్స్‌తో వెళ్ళి సినిమాలో అంత టాక్ వచ్చేంత ఏముంది అన్న చాలామంది మగాళ్లను చూస్తాం కాని, సినిమా సూపర్ హిట్ కు తక్కువ చెప్పే లేడీస్ లేరు అన్నది నిజం. అంత బాగా “అత్తారింటికి దారేది” సినిమా వాళ్ళకు ఎక్కేసింది. వందకోట్లు రీచ్ అయితే, వీళ్ళే కారణం అవ్వాలి.

Filed Under: Pawan KalyanFeatured