చివరి నిమషంలో చేతులు మారిన నాయక్ నైజాం డిస్ట్రిబ్యూషన్

charan-with-mama

ఆ నలుగురి మధ్య అసలు ఏమి జరుగుతుందనే నిజం ఎవరికీ తెలియదు. అన్నీ ఊహాగానానే. ఆ నలుగురు ఎవరనేది కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ఊహించుకుంటారు.

“ఆ నలుగురి పెద్దల చేతిలో తెలుగుసినిమా ఇరుక్కుపోయింది. వారు కరుణిస్తేనే సినిమా రిలీజ్ కు థియేటర్స్ దొరుకుతాయి..” అని దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి ‘ఆ నలుగురు’ అనే వర్డ్ బాగా పాపులర్ అయ్యింది.

విచిత్రం ఏమిటంటే ఆ నలుగురు అంటూ దాసరి నారాయణ రావు విమర్శించారు. కాని ఆ నలుగురులో దాసరి నారాయణరావు కూడా ఒకరు అని కొందరు ఊహిస్తూ వుంటారు.

1) డి. సురేష్ బాబు
2) అల్లు అరవింద్
3) దిల్ రాజు
4) దాసరి నారాయణరావు

నాయక్ విషయానికి వస్తే, వినాయక్ ‘కృష్ణ’ సినిమా మాదిరి ఈ సినిమా మొత్తం రాష్ట్రం డిస్ట్రిబ్యూషన్ దాసరి నారాయణరావు అని ఈ సినిమా షూటింగ్ మొదలయిన కొత్తలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నిజం కాలేదు.

ఆ తర్వాత, తెలుగు సినిమాలకు కీలకమైన బిజినెస్ ఏరియా అయిన ‘నైజాం’ డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజు అని జరిగింది. ఈ ప్రచారం నిజం కాలేదు.

ఇప్పుడు:
చివరి నిమషంలో చేతులు మారి నాయక్ నైజాం డిస్ట్రిబ్యూషన్ అల్లు అరవింద్ అంటున్నారు. చేతులు మారిన విషయంలో ఎంత నిజం వుందో తెలియదు కాని, ఫైనల్ గా డిస్ట్రిబ్యూషన్ అల్లు అరవింద్ చేస్తున్నారనేది నిజం.

ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు పోటా పోటీగా బాక్సాఫీసు బరిలోకి దూకుతున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘నాయక్’ చిత్రం కాగా, మరొకటి మహేష్ బాబు-వెంకటేష్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి దిల్ రాజు స్వయంగా నిర్మాత. నాయక్ కూడా ఆయనే డిస్ట్రి బ్యూషన్ చేస్తే, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రిలీజ్ అవ్వగానే ‘నాయక్ ‘ థియేటర్స్ తగ్గించేస్తాడనే భయం మెగా అభిమానులలో వుంది.

ఇప్పుడు ఆ భయం పోయింది. సినిమా బాగుంటే, వేరే సినిమాలు ఎలా వున్నా నాయక్ కు రికార్డ్ బ్రేకింగ్ ఓపినింగ్స్ ఖాయం.

మెగా అభిమానులతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా విజయంపై ఆశలు పెట్టుకోవడం వింటుంటే, వినాయక్ అంచనాలను రీచ్ అయ్యే సినిమానే అందించి వుంటాడనిపిస్తుంది.

Filed Under: Mega FamilyFeatured