రాజమౌళిని చూసి నేర్చుకొండ్రా

TOP Four

ఒక కోణంలో చూస్తే, తెలుగులో టాప్ 4 డైరక్టర్స్.

1-10. రాజమౌళి
11. పూరి జగన్నాధ్
12. త్రివిక్రమ్ శ్రీనివాస్
13. సుకుమార్

వీళ్ళ నలుగురు డైరక్టర్స్ ఒక కామన్ విషయం వుంది. హిరో డామినేటెడ్ తెలుగు ఇండస్ట్రీ కాబట్టి, హిరోకు తల వంచుతారు, హిరోనే నమ్ముకుంటారు, కాని సబ్జక్ట్స్ విషయంలో విషయంలో కాంప్రమైజ్ కారు.

త్రివిక్రమ్ తెలుసుకున్నాడు. తప్పు చేసిన వెంటనే సరిదిద్దుకుంటాడు. రాజమౌళి స్థాయికి ధీటుగా నిలబడే రోజు దగ్గర్లోనే వుంది. ప్రేక్షకుల కోసం కాంప్రమైజ్ అవుతున్నాడు కాబట్టి, కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా, అల్టిమేట్‌గా కమర్షియల్‌గా సక్సస్ అవుతున్నాడు.

పూరి జగన్నాధ్ పూర్తిగా నాకేసాడు. థియేటర్‌కు వెళ్ళాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసాడు. రాంగోపాలవర్మ తరహాలో “నా ఇష్టం” అని మనసులో అనుకుంటూ పైత్యం పెంచుకొంటున్నాడు. ఈ పైత్యం వలన పెద్ద హిరోలు కూడా దూరమవుతున్నారు. చిరంజీవి ఇచ్చిన అవకాశాలను చేజేతులా నాశనం చేసుకున్నాడు.

సుకుమార్ ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతి అందించాలని తాపత్రయం వుంది కాని, పాపం ఎదో మిస్ అవుతుంది.

పూరి జగన్నాధ్ & సుకుమార్ లు రాజమౌళిని చూసి నేర్చుకోవాలని సినీ పండితులు అంటున్నారు. కథ-కథనాల విషయంలో వాళ్ళల్లో రావల్సిన మార్పు ఏమీ లేదు. పూరి జగన్నాధ్ రెండు నెలల్లోనే సినిమా తీయాలి, సుకుమార్ అదే ఇంటిలిజెన్స్‌తో సినిమాలు తీయాలి. కాకపొతే:: కథ చెపుతున్నప్పుడు కాని, సినిమా అవుట్‌పుట్‌తో హిరోను ఎలా ఇంప్రెస్ చేస్తున్నారో, ప్రేక్షకులను కూడా అదే స్థాయిలో ఇంప్రెస్ చెయ్యడానికి కష్టపడాలి.

రాజమౌళి సినిమాలకు కూడా ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వుంటుందో, అదే స్థాయిలో తప్పులు ఎంచేవారున్నారు. కాని, కమర్షియల్ సక్సస్‌తో వాళ్ళ నోళ్ళు మూయిస్తున్నాడంటే కారణం ప్రేక్షకుల కోసమే తను సినిమా తీస్తున్నాడనే క్లారిటీ వుంది.

గమ్యం “క్రిష్” కూడా పై లిస్టులో వుండాలి కాని, హిరోకు ఎందుకు తలవంచాలనే ఇగో వుంది. సినిమాను హైప్ చేసుకొవడంలో చాలా వెనుకబడివున్నాడు. టైటిల్‌లోనే సగం నీరసం క్రియేట్ చేస్తాడు. బాహుబలిని మించి కంచె లాంటి సినిమాను తీసి ప్రమోట్ చేసుకొలేకపొయాడు. ఈయన సినిమాలు ప్రిరిలీజ్ హైప్ చెయ్యడం నేర్చుకొవాలి. పెద్ద హిరోల కోసమే కథలు అన్నట్టు వ్రాయగల్గాలి.

bottomline:
రాజమౌళిని చూసి నేర్చుకొండ్రా ..
సినిమాను ప్రేక్షకుల కోసమే తీస్తున్నామని తెలుకోండి. మీ సొంత పైత్యం సినిమాల్లో తగ్గించుకోండి. సినిమాలను బాగా మార్కెటింగ్ చేసుకోండి.

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *