Loved it

Pawan Kalyan

ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ & సెక్షన్ 8 అంశాలు చాలా సున్నితమైన అంశాలు. ప్రజల కోసం కాకుండా, పార్టీ కోసమే ప్రభుత్వాలు ఎక్కువ దృష్టి పెట్టడం వలన వచ్చిన సమస్యలు. ఎలా స్పందించినా, అసలు సమస్యలు పక్కన పెట్టి, స్పందించిన వాడిపై విమర్శలు గుప్పిస్తారు.

ప్రజలు మధ్య విభేదాలు సృష్టించే విధంగా ప్రభుత్వాలు పని చేస్తుంటే ఏమని స్పందించాలి? ఎలా స్పందించాలి?

ఎట్టకేలకు పవన్‌కల్యాణ్ స్పందించక తప్పలేదు.

మెగా ఫ్యాన్స్
జగన్ ఫ్యాన్స్
టి.డి.పి ఫ్యాన్స్
తెలంగాణ ప్రజలు
ఆంధ్ర ప్రజలు
హైదరాబాద్ వాసులు

ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్దం తీసుకొనేలా వుంది. కాని చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్దం అవుతుంది. ఎందుకంటే వున్నది వున్నట్లు మాట్లాడాడు. అందరూ ఏమనుకుంటున్నారో అదే చెప్పాడు.

  1. రేవంత్‌రెడ్డి తప్పు చెయ్యలేదు. ఓట్లకు డబ్బులు ఇవ్వడం, ఓటర్లు డబ్బులు తీసుకొవడం ఈనాటి రాజకీయల్లో సర్వ సాధారణ విషయం
  2. ఆంధ్రోళ్ళు అని విమర్శించడం క్షమించరాని నేరం
  3. ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు వ్యాపారం కోసం కాకుండా, ప్రజల కోసం పని చెయ్యాలి

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *