డిఫరెంట్ సౌండ్‌తో ‘1’ ఆడియో

1

సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన చిత్రం ‘1’. ‘నేనొక్కడినే’ అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. కృతి సనన్ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శ్రీను వైట్లకు అందించారు.

ఏదైనా కొత్త సినిమా పాటలు వచ్చినప్పుడు ఆ మ్యూజిక్ డైరక్టర్‌కు సంబంధించిన సినిమా పాటలు గుర్తుకు రావడం మాములు. అలా కాకుండా డిఫరెంట్ సౌండ్‌తో ‘1’ ఆడియో వుంది. కాబట్టి ఒక్కసారి వినంగానే నచ్చేసే సాంగ్స్ కాదు. వినగా వినగా నచ్చవచ్చు.

సుకుమార్-దేవిశ్రీ కాంబినేషన్‌కు మహేష్‌బాబు తోడయ్యాడు, అందులోను దేవిశ్రీ ప్రసాద్‌కు మహేష్‌బాబు మొదటిసారి మ్యూజిక్ అందిస్తున్నాడు అని హై ఎక్సపెటేషన్స్ పెట్టుకున్న వాళ్ళకు నిరాశే.

విభిన్నమైన కధాంశంతో రూపొందుతున్న సినిమా కాబట్టి, మ్యూజిక్ విషయంలో కూడా విభిన్నంగానే ప్రయత్నం చేసారనవచ్చు. రోటీన్ రోటీన్ అని బాదపడే సినీ ప్రియులకు ఒక మంచి అల్భం.

Filed Under: Extended FamilyFeatured