సర్దార్ గబ్బర్‌సింగ్ మేకింగ్

Share the joy
  •  
  •  
  •  
  •  

sgs making

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ‘పవర్’ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. పవన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను శరత్ మరార్ భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్నారు. ఇక సినిమాను ఎలాగైనా ఏప్రిల్ 8కల్లా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ‘సర్దార్’ టీమ్ బాగా కష్టపడుతున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కాని, నార్మల్ జనం మాత్రం అంతగా ఎక్సైట్ అవ్వడం లేదు.

సినిమాను హైప్ చేసే ప్రయత్నంలో ఈ సినిమా మేకింగ్ విడియో ఒకటి రిలీజ్ చేసారు చిత్రం నిర్మాత శరత్ మరార్ శరత్ మరార్. రెండు పాటల కోసం టీమ్ త్వరలోనే స్విట్జర్లాండ్ వెళ్ళనుంది. స్విట్జర్లాండ్ షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తవుతుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఏప్రిల్ 20న విడుదల కానుంది.

మేకింగ్ విడియో చాలా బాగా ఎడిట్ చేసారు .. ఇదే రేంజ్‌లో సినిమా వుంటే, గబ్బర్‌సింగ్ మించి సర్దార్ గబ్బర్‌సింగ్ హిట్ అయ్యే సూచనలు వున్నాయి.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *