పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వం అంటే ఇష్టం – మంచు మనోజ్

manchu-manoj-kumar

తుఫాన్‌లో రామ్‌చరణ్ బాగా చేసాడు, కాని ఆ సినిమా సెలెక్ట్ చేసుకొవడం కరెక్ట్ కాదని చాలా మెగా అభిమానులు అంటున్నారు. ఆ టాక్‌కు తోడు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం బాగోక పొవడంతో సినిమా చూసే ప్రయత్నం చెయ్యలేదు. కాబట్టి నో రివ్యూ.

పవన్‌కల్యాణ్ చిరంజీవి తమ్ముడు అయినంత మాత్రాన పవన్‌కల్యాణ్ ఆశీంచిన అవకాశాలు వాటంతట అవి వచ్చేయలేదు. పవన్ కల్యాణ్ సెలక్షన్‌కు లక్ కూడా తోడయ్యి ‘తొలిప్రేమ’ & ‘తమ్ముడు’ సినిమాల ద్వారా కమర్షియల్ హిట్స్‌తో పాటు, పవన్‌కల్యాణ్‌కు యాక్టింగ్‌పై మంచి గ్రిప్ వచ్చింది. అక్కడ నుంచి పవన్‌కల్యాణ్ తిరుగులేకుండా తను అనుకున్న సినిమాలు చేయగల్గుతున్నాడు.

ఇప్పుడు మంచు మనోజ్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

కరుణాకరన్(తొలిప్రేమ), అరుణ్ ప్రసాద్(తమ్ముడు), పూరి జగన్నాద్(బద్రి) & సూర్య(ఖుషి) సినిమాలు వరుసగా వచ్చినపుడు పవన్‌కల్యాణ్ కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తాడు అనే ప్రచారం వుంది. అదే ప్రశ్నను పవన్‌కల్యాణ్‌ను అడిగినపుడు పెద్ద దర్శకులు నాతో చెయ్యడానికి ఇష్టపడక పొవడం, కొత్త దర్శకులు నన్ను వెతుక్కొని రావడం వలన వాళ్ళకి అవకాశం వచ్చింది తప్ప, నా గొప్పతనం ఏమి లేదని సమాధానం ఇచ్చాడు.

ఇప్పుడు అంతే నిజాయితీతో మంచు మనోజ్ నిజాన్ని ఒప్పుకుండటం వలన ఈ ఆర్టికల్.

ఈనాడు: పెద్ద పెద్ద సినిమాలు తీసి, ఒకేసారి పెద్ద హిరో అయిపొవచ్చు కదా?
మంచు మనోజ్: నాకు కూడా పెద్ద సినిమాలుచెయ్యాలని వుంటుంది. రిటర్న్ రావు. సొంతంగా పెట్టి చేతులు కాల్చుకున్న సందర్భాలు చాలా వున్నాయి. బయట నిర్మాతలు పెట్టరు. చిన్న సినిమాలే చెయ్యాలి. ఆ బడ్జెట్‌లో ఏమి చెయ్యగలనో అదే చెయ్యాలి. అందుకనే కొత్త దారులు వెతుక్కుంటా. మీరేమో ప్రయోగాత్మకం అంటారు. నేనేమో నా పరిధిలో తీసిన సినిమాలు అనుకుంటాను.

ఒకప్పుడు మోహన్‌బాబు స్పీచ్‌లు ఇండైరక్ట్‌గా చిరంజీవిని ఉద్దేశించి వెటకారం చేస్తున్నాడు అన్నట్టు వుండటం వలన మరియు
పబ్లిక్‌లో పవన్‌కల్యాణ్ & చిరంజీవిలు ఇండైరక్ట్‌గా మోహన్ బాబుపై ఒకసారి విరుచుకు పడటం వలన
మోహన్ బాబును, మోహన్ బాబు ఫ్యామిలీని చాలా మంది మెగా అభిమానులు ద్వేషిస్తారు.
కొంతమంది మెగా అభిమానులు చిరంజీవి మోహన్ బాబుతో మళ్ళీ తిరిగి కలిసునందుకు చిరంజీవిని కూడా తిడుతుంటారు.

అవన్నీ పక్కన పెట్టి:
పరిశ్రమలో స్నేహితుల గురించి మాట్లాడుతూ, “పవన్ కల్యాణ్ అంటే ఇష్టం. చాలా మంచి మనిషి” అని మంచు మనోజ్ చెప్పడం విశేషం.

ప్రేక్షకుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కాకుండా, మంచి స్నేహ భావాలను రూపొందించే ఇటువంటి నిజాలు బయటకు చెప్పినందుకు మంచు మనోజ్ కు ధన్యవాదాలు.

Filed Under: Extended Family