యూత్‌కు కనెక్ట్ అయితే మరో తొలిప్రేమ

oka manasu

కొణిదెల నీహారిక వెండితెర తెరంగేట్రం చేస్తూ నటించిన చిత్రం “ఒక మనసు”. నాగశౌర్య కథానాయకుడు. “మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు” ఫేమ్ రామరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. టీవి9 మరియు మధుర శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రాన్ని జూన్ 24న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవల మెగా హీరోల సమక్షంలో ఘనంగా జరిగింది.

మెగాఫ్యామిలీ నుంచి వస్తున్న హిరోయిన్. పాటలన్నింటిలోనూ కౌగిలింతలు .. ముద్దులు ..అవే కనపడుతున్నాయి. ఫస్ట్ టైం మెగాఫ్యాన్స్ డైజస్ట్ చేసుకొవడం కష్టం.

డైరక్టర్ రామరాజు, చాలా సెన్సిటివ్‌లా వున్నాడు. చాలా సిన్సియర్‌గా ప్రయత్నం చేసాడు. యూత్‌కు కనెక్ట్ అయితే మరో తొలిప్రేమ అయ్యే అవకాశాలు వున్నాయి.

వాళ్ళు చెప్పినట్లు పాటలు “గీతాంజిలి” “అభినందన” “ఏం మాయ చేసావే” రేంజ్‌లో లేకపొయినా, క్లాస్‌గా వున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమాలో సిట్యువేషనల్‌గా వుంటే బాగా హిట్ అవుతాయెమో.

“మెగా ఫ్యామిలీ నుంచి అబ్బాయిలందరూ హిరోలుగా వస్తే తప్పు లేనిది, అమ్మాయి అయిన నేను హిరోయిన్ అయితే తప్పేంటి నాన్న” అంటూ నాగేంద్రబాబును ఒప్పించిన నిహారిక, నిహారిక కంటే అందగాడైన నాగ సౌర్య చూడముచ్చటగా వున్నారు.

పాటలు స్లో .. సినిమా స్లో .. హిట్ కూడా స్లోగా అయ్యే ఛాన్సస్ వున్నాయి. ఈ సూపర్ ఫాస్ట్ యుగంలో ఈ సినిమా ఎలా నెగ్గుకొస్తుందో !! నిహారిక లక్ మీద ఆధారపడి వుంది.

Filed Under: Featuredఒక మనసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *