సరైనోడు – రెండు కాదు, మూడు వారాలు ఆగాలి

AA

అల్లు అర్జున్ కథానాయకుడిగా… బోయపాటి శ్రీను దర్శకత్వంలో… గీతా ఆర్ట్స్ బ్యానర్లో… అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు ఏప్రిల్ 8 రిలీజ్ టార్గెట్ పెట్టుకొని పని చేసారు. కాని ఆ డేట్‌ను పవన్‌కల్యాణ్ కబ్జా చేసేయడంతో, సర్దార్ గబ్బర్‌సింగ్ రిలీజ్ డేట్‌కు రెండు వారాలు గ్యాప్ ఇచ్చి, ఏప్రిల్ 22న వస్తున్నారు. రెండు కాదు, మూడు వారాలు ఆగాలి అని అంటున్నారు పవన్‌ఫాన్స్. మే నెలలో వేరే పెద్ద సినిమాలతో పాటు, సాయిధర్మ్‌తేజ్ “సుప్రీమ్” కూడా వుండటంతో, ఇంకో వారం మూవ్ చెయ్యడం సాధ్యం కాదంటున్నారు సరైనోడు చిత్ర యూనిట్ వాళ్ళు.

తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్ర పాటల్ని ఆడియో వేడుక లాంటి ఆర్భాటాలు ఏమీ లేకుండా ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేసారు. ఏప్రిల్ రెండో వారంలో విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేయనున్నారు. ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంజలి ఓ ప్రత్యేకగీతంలో అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేసింది.

PSPK Charan ‏@Alwaysraviteja
@SKNonline 22 Rel Avasarama Bayya. 29 chesthe Super Undedi.Manalo Manaki Poti Enti.. @GeethaArts @harikiranroyal

G Sriniwasa Kumar ‏@SKNonline
@Alwaysraviteja @harikiranroyal 2 weeks sufficient gap in Summer brother.Malli 2 weeks lo other Mega family & other Biggie’s ll release

Filed Under: Featuredసరైనోడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *