మెగా ఫ్యాన్స్ హ్యాపీ

1574310cd-1

దాసరికి చిరంజీవి అన్నా అల్లు అరవింద్ అన్నా ఎందుకో మంట అనుకుంట. వాళ్ళ మధ్య వున్న ప్రేమలు పగలు ఏమిటనేది పబ్లిక్‌కు తెలియదు. ఒకప్పుడు చిరంజీవి ఫంక్షన్ అంటే దాసరి నారాయణ రావు స్పీచ్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూసేవారు. ఆ రేంజ్‌లో పొగిడే వాడు. అటువంటి ప్రేమ ఇంత పగలా మరటానికి కారణమేమిటో వాళ్ళకే తెలియాలి.

మొన్నటి వరకు పేర్లు చెప్పకుండా ఏవేవో విమర్శలు చేసేవాడు దాసరి. అవి మెగాఫ్యామిలీని వుద్దేశించి నట్టుగానే వుండటం, మీడియా చిరంజీవిని ఉటకాయించడం జరిగేది. ఒక పక్క నిస్సాహాయ అభిమానులు దాసరిని బూతులు తిట్టుకుంటుంటే, మెగాఫ్యామిలీ మాత్రం మళ్ళీ దాసరినే తమ ఫంక్షన్స్‌కు చీఫ్ గెస్ట్‌గా పిలుస్తూ వుండే వారు. చిరంజివిని ఏమైన అంటే తట్టుకోలేని మెగాఫ్యాన్స్ వెర్రిపప్పలుగా మిగిలే వారు.

మొన్నటి వరకు ఇండైరక్ట్‌గా చేసిన దాసరి, నిన్న మాత్రం నోరు జారాడు. గోవిందుడు అందరివాడేలే సినిమా కోసం లౌక్యం సినిమాను ఎత్తేసారని, తీరా చూస్తే గోవిందుడు అందరివాడేలే మూడు రోజులే ఆడిందని డైరక్ట్‌గా అనేసి, మీడియా ఎదో కల్పించినట్టు స్పిరిట్ మాత్రమే తీసుకొవాలని తన తప్పును మీడియా మీదకే నెట్టివేయడానికి ప్రయత్నం చేసాడు. అదే స్పీచ్‌లో హిరోలు మొఖాలు చెక్కించుకుంటున్నారు, జనాలపై రుద్దుతున్నారని కూడా అన్నాడు. పేర్లు చెప్పకపొయినా, రామ్‌చరణ్‌నే అన్నట్టుగా వుంది. అంత పెద్ద మనిషి పిల్లలపై కూడా ఇలా కామెంట్స్ ఏమిటని మెగా అభిమానులకే కాదు, అందరికీ ఆశ్చర్యమేసింది.

ఎట్టకేలకు దాసరి కామెంట్స్ అల్లు అరవింద్ & దిల్ రాజుకు తగిలినట్టు వున్నాయి. మెగా ఫ్యాన్స్ సెల్ఫ్ బ్యాన్ చెయ్యాలనుకుంటున్న దాసరి ఎర్రబస్ రిలీజ్ రోజే తమ సినిమా ‘పిల్లా .. నువ్వు లేని జీవితం’ సినిమా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నాం అని ఎనౌన్స్ చేసారు. మెగా ఫ్యాన్స్ హ్యాపీ.

ప్రెస్ మీట్ పెట్టి మరీ నవంబర్ 14 అని చెప్పినప్పుడు వేరే మాటలు నమ్మకూడదు కాని, పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వుంది, దానిని నవంబర్ 14 లోపు ఫినిష్ చెయ్యడం కష్టం అంటున్నారు.

Filed Under: Mega FamilyFeatured