మెగాస్టార్ vs మెగాఫ్యాన్స్

Jaichiranjeeva

మెగాస్టార్ = చిరంజీవి
మెగాఫ్యాన్స్ = చిరంజీవి ఫ్యాన్స్

వీళ్ళందరికి(90%) పవన్‌కల్యాణ్ అంటే ఇష్టం. 90% లో 10%కి పవన్‌కల్యాణ్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. మెగాఫ్యాన్స్ కాకుండా పవన్‌కల్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా అధిక సంఖ్యలోనే వున్నారు. సరదాగానో సిరియస్‌గానో పవన్‌కల్యాణ్ అభిమానులు చేసే కొద్ది అతి వలన 10% మెగాఫ్యాన్స్ కి పవన్‌కల్యాణ్ అంటే ఇష్టం వుండదు.

కేవలం పవన్‌కల్యాణ్ అంటే ఇష్టపడే వాడు, పవన్‌కల్యాణ్ లేని మెగా ఫంక్షన్స్‌కు వెళ్ళడు. మెగా ఫంక్షన్స్‌లో పవర్‌స్టార్ పవర్‌స్టార్ అని అరిసేది పవన్‌కల్యాణ్‌ను ఎక్కువగా ఇష్టపడే మెగాఫ్యాన్స్(చిరంజీవి ఫ్యాన్స్).

మెగాస్టార్ సినిమాలు కేవలం మెగాఫ్యాన్స్ చూస్తేనే అంత పెద్ద హిట్ అయ్యాయా?
అందరికీ నచ్చేవి. మెగాఫ్యాన్స్‌తో పాటు అందరూ చూసే వారు. మెగాఫ్యాన్స్ ఒకటికి పదిసార్లు చూసేవారు. మెగాఫ్యాన్స్ చేసే హడావుడి చూసి ప్రేక్షకులందరిలోను ఒక ఊపు వచ్చేది. మా మెగాస్టార్ అని ఎంత ధైర్యంగా చెప్పుకునే వారో, అదే రేంజ్‌లో మెగాస్టార్ సినిమాలు వచ్చేవి. చిరంజీవి కూడా మెగా అభిమానులు, వాళ్ళు వేసే ఈలలే తనకు ఉత్సాహం అని ఎంకరేజ్ చేసేవాడు.

అల్లు అర్జున్ ధైర్యమా? అమాయకత్వమా?
మెగాఫ్యాన్స్ అందరూ నందమూరి అభిమానులను “నందమూరి వంశం నుంచి ఎంత మంది వస్తారు? మీరు ఎంతమందికి బానిసలుగా వుంటారు? అని” వెక్కిరించేవారు. ఇప్పుడు మెగాస్టార్ కుటుంబం నుంచి నందమూరి కుటుంబం కంటే ఎక్కువ మంది రావడంతో, నందమూరి అభిమానులు వెక్కిరించడం సాదారణ విషయం. మెగాఫ్యాన్స్ ఇరగబడి సపోర్ట్ చెయ్యకపొయినా, సినిమా బాగుందంటే తప్పకుండా సపోర్ట్ చేస్తారు. బన్నీ మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో, పవన్‌కల్యాణ్ కూడా మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కోన్నాడు. సాయిధర్మ్‌తేజ్‌ను అయితే డైరక్ట్ గానే విమర్శించారంట. అల్లు శిరీష్ పరిస్థితి ఇంకా దారుణం(మొన్న “ఒక మనసు” ఆడియో ఫంక్షన్‌కు కూడా పిలవలేదు). రామ్ చరణ్ & వరుణ్ తేజ్ మీద విమర్శలు తక్కువ.

ఇప్పుడు కొత్తగా అందరూ చూస్తేనే సినిమా ఆడుతుందని సరికొత్త లాజిక్ సృష్టించడంలో అర్దం ఏమిటి? మెగాఫ్యాన్స్‌ను కంప్లీట్‌గా ఇగ్నోర్ చెయ్యవలసిన అవసరం ఏమిటి? ఇది అల్లు అర్జున్ ధైర్యమా? అమాయకత్వమా?

bottomline:
ఫ్యాన్స్ మధ్య సరదా గొడవలు సహజం. హిరోలు సర్దిచెప్పాలి లేదా కామ్‌గా వుండాలి కాని, రెచ్చగొట్టకూడదు. అల్లు అర్జున్, అల్లుఫ్యాన్స్ అని ఎందుకు సెపరేట్‌గా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు? అనే విషయాన్ని అల్లు ఫ్యామిలి వాళ్ళు చెపితే కాని తెలియదు.

pawanfans.com అంటే అల్లు వారి దగ్గర డబ్బులు తీసుకొని అల్లు అర్జున్‌ను అతిగా ప్రమోట్ చేస్తుందని కామెంట్స్ వచ్చేవి. అల్లు ఫ్యామిలి వారి పనికిమాలిన రాజకీయల వలన అల్లు అర్జున్ అంటే తక్కువ చేసి వ్రాయవలసి వస్తుంది. కొత్త ఫ్యాన్స్ కోసం, ఎంతో అండగా వున్న మెగాఫ్యాన్స్‌ను దూరం చేసుకొవడం మంచిదో చెడ్డతో కాలమే సమాధానం చెపుతుంది.

Filed Under: Mega Family

commentscomments

 1. Ganesh says:

  150 Chiranjeevi mve opening ki family members andaru attend ayyaru including kids Pawan Kalyan yenduku Raledu. A AAA function ki yenduku velladu. Dasari Bday Yenduku velladu..

 2. Hari says:

  Ganesh, you are right. but, పవర్‌స్టార్ మెగా ఫంక్షన్స్‌కు రాకపొవడం అనేది కొత్త కాదు. మెగా ఫ్యామిలీకి పెద్ద మెగాస్టార్. పవర్‌స్టార్, తను రాకపొయినా పెద్ద నష్టం ఏమీ లేదని ఫీల్ అవుతాడెమో.

  తన వెన్నంటి వున్న అన్నయ్యను కాని, అన్నయ్య ఫ్యాన్స్ కాని పవర్‌స్టార్ అవమానించిన సందర్భాలు వున్నట్టు లేవు.

 3. RK says:

  Well said Hari Garu.

 4. raju says:

  edaina meku faver ga matladukontaru. kani andi meku alavateeee. me valla PK garu meda istam taggipotundi janalaki.idi nijam.PK fan kakapoina PK movies chustaru.ayina attarintiki daredi movie only pk fans chuste 75 crores vachayaaa.AA fans ram charan fans Chiru fans inka villu kakunda cinema lovers and common people chuste kada hit ayyindi. ade bunny cheppadu andaru chuste movie hit avutundi ani daniki enduku ala behaviour chestaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *