Mirchi “V”Review By Oka Vimarsakudu

prabhas-mirchi-movie-latest-photos5

మిర్చి సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంటే ఇప్పుడు రివ్యూ ఏంటి అని అనుకుంటూన్నారా !!
ఇది రిలీజ్ అవగానే అందరు ఇచ్చే రొటీన్ రివ్యూ కాదు బాసు .

సినిమా చూసి వచ్చిన ప్రేక్షకుడు చేసే రెండు మూడు casual నెగటివ్ కామెంట్స్ ని, DTS లో స్ప్రెడ్ చేసి చేసి అలిసిపోయి ,చివరకి వారం తర్వాత టిక్కెట్  కొనుక్కుని సినిమా చూసి వచ్చిన ఒక విమర్శకుడు ఇచ్చిన రివ్యూ ఇది.

ఇక రివ్యూ మనోడి మాటల్లో:

————————–

* డ్యూయల్  రోల్ లో ప్రభాస్ ఇరగ తీసాడు . అక్కడక్కడ లావుగా కనిపిస్తూ, మళ్ళీ sudden గ సన్నపడిపోతు  సినిమాని Balance చేసిన విధానం అధ్బుతం .

* సినిమా మొత్తంలో ప్రభాస్ ఎక్కడా కష్టపడినట్టు కనిపించలేదు, Acting ని ease తో easy గ చేసేసాడు.అందుకే నాకు తన performance  అంతగా నచ్చలేదు .

* రొటీన్ స్టొరీ కి రొటీన్ ఆర్టిస్ట్ లతో పాటు , ఇద్దరు హీరోయిన్లు పెట్టుకుని ,రిచా ని వదిలేసి అనుష్క తో సెటిల్ అయిపోడం చాలా బాధకి గురిచేసింది.

* ప్రభాస్ కి తండ్రి క్యారెక్టర్ చేసిన సత్య రాజు ,ప్రభాస్ రాజు చెంప మీద కొట్టిన సీన్ చూసిన  Fans గోల చేసి సినిమాని ఆపకుండా,తెర ని చింపకుండా సినిమాని సినిమా గ చూడడం      నాకేం నచ్చలేదు.

* కత్తిని నాకంటే బాగా ఎవడు వాడలేడు అని అన్నాడు గాని ,దాన్ని మనుషుల్ని నరకడానికి తప్ప పనికి వచ్చే దానికి ఎక్కడా వాడలేదు .

ఒక్క సీన్ లో అయిన  కత్తిని కట్టెలు కొట్టడానికో ,పూలు కోయడానికో వాడినట్టు చూపించి ఉంటె కొంచెం బాగుండేది …….అని పనికి రాని కామెంట్స్ చేస్తూ

ధియేటర్ నుంచి బయటకి వచ్చిన విమర్శకుడుని  ,సినిమా ఎలా ఉంది బయ్యా అని ఒకడు అడిగినప్పుడు , మనోడు ఇచ్చిన ఆన్సర్ :

” Dude  ,వీలయితే సినిమా చూడు Dude , పోయేది ఏమి ఉంది మహా అయితే రెండునర్ర గంటలు టైం బొక్క తప్ప”

Filed Under: Extended FamilyHari ReviewsJust4Fun