మిర్చి Xవ్యూ

Prabhas Mirchi Movie Latest Photos Stills, Prabhas Anushka Mirchi Movie Pictures Images

సినిమా ఎలా వుంది?
మొదటి నుంచి చివరి దాకా వయలెన్స్ మూడ్ తో సాగుతూ వయలెన్స్ వలన నష్టమే కాని లాభం లేదని చెపుతూ, ప్రత్యర్దులకు వయలెన్స్ ప్లేసులో ప్రేమను ఇవ్వండి అని కుటుంబ సమేతంగా చూపించడానికి చేసిన ప్రయత్నం. బావుంది.

వయలెన్స్ ఎక్కువ అయ్యిందా?
కథ డిమాండ్ మేరకు ఆ వయలెన్స్ అవసరం. అనవసరమైన వయలెన్స్ కాదు, కాని విమర్శకులు వయలెన్స్ ఎక్కువైంది అనే అవకాశం వుంది.

ప్రభాస్ ఎలా వున్నాడు? ఎలా చేసాడు?
బాగున్నాడు. బాగా చేసాడు. బుగ్గలు లాగేయడం వలన అక్కడక్కడా డల్ గా వున్నాడు.

పాటలు ఎలా వున్నాయి? డాన్సస్ ఎలా చేసాడు?
పాటలు బాగున్నాయి. ప్రభాస్ డాన్సస్ విషయంలో పవన్ కళ్యాన్ & మహేష్ బాబు కేటగిరి లోకి వస్తాడు. డాన్స్ ఎక్సపెట్ చెయ్యకూడదు.

కామెడీ ఎలా వుంది? సెంటిమెంట్ బాగా పండిందా?
సినిమా అంతా సరదాగా సాగిపోతుంది. సెంటిమెంట్ బాగా పండింది. సినిమా అంతా వయలెన్స్ మూడ్ లో సాగడం వలన కామెడీని, సెంటిమెంట్ ను మర్చి పోయే అవకాశం వుంది.

ఇంతకీ సినిమా చూడవచ్చా?
పొడిచేసే కథ కోసం కాకుండా, ప్రభాస్ కోసం, ఎంటరటైనమెంట్ కోసం, హృదయానికి హత్తుకునే సీన్స్ కోసం తప్పకుండా ఒక్కసారి చూడవచ్చు.

కమర్షియల్ గా హిట్ అవుతుందా?
వేరే సినిమాలు వచ్చే దాకా బాగానే ఆడే సినిమా. మాస్ కు కచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీస్ కు కూడా నచ్చుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా నచ్చుతుంది.

విమర్శకులకు నచ్చకపోవచ్చు.

ps: డైలాగ్స్ సిట్యువేషన్ కు తగ్గట్టు చాలా బాగున్నాయి.too good.

Filed Under: FeaturedHari Reviews