బొక్కలో తోయవలసింది ముద్రగడను, బలహీనులను కాదు

mudragada

రైలు ఎవరు తగలబెట్టారు అనేకంటే ముందు ఎందుకు తగలబెట్టారు అనే కోణంలో దర్యాప్తు జరగాలి. బొక్కలో తోయవలసింది ముద్రగడను, బలహీనులను కాదు. రెచ్చగొట్టింది ముద్రగడ. ప్రేరేపించింది ముద్రగడ. మూల కారకుడు ముద్రగడ. బాద్యత వహించవలసింది ముద్రగడ. ప్రణాళిక లేకుండా రైలు రోకోకు, అంత మంది జనంతో పిలుపునివ్వడం ముద్రగడదే తప్పు.

బాద్యతగా వవ్యహరించవలసిన నాయకులు, ఇలా రెచ్చగొట్టే ధోరణిలో ప్రభుత్వ ఆస్తులని తగులబెట్టే స్థాయికి బలహీనులను తీసుకొనివెళ్ళడం, వారిని కోర్టుల చుట్టూ తిరిగేలా చెయ్యడం దారుణం.

పవన్‌కల్యాణ్ స్పందించాలి స్పందించాలి అని అంటారు. ఏమని స్పందించాలి? ఎందుకు స్పందించాలి? ప్రభుత్వం వుంది కదా .. ప్రతి పక్షం వుంది కదా .. !

పవన్‌కల్యాణ్ స్పందిస్తే:
అభివృద్ది కోసం పాటుపడవలసిన సమయంలో కుల చిచ్చు రాజకీయాలతో, రాజధాని లేని రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నాలు చేయవద్దని స్పందించవచ్చు. బలహీనులను విడిపించి, ముద్రగడను బొక్కలో తోసేలా చూడాలి.

వుండవల్లి చెప్పినట్టు, ఇదంతా చంద్రబాబు చేస్తున్న కుల రాజకీయం అయితే మాత్రం, ప్రస్తుతం దేవుడు మినహా చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరు.. మొన్నటి దాకా ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు పెంచారు. అవి ఇంకా చల్లారకముందే ఇలా కులం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు పెంచడం వెనుక రాజకీయ లబ్ది చూసుకుంటే క్షమించరాని నేరం.

Filed Under: Pawan Kalyan