రచ్చ vs నాయక్

nayak-vs-raccha

రచ్చ. రచ్చ తర్వాత నాయక్ . ఇలా ‘రామ్ చరణ్’ పూర్తిగా మాస్ సినిమాలే చేస్తున్నాడని మెగా అభిమానులలో ఒక వర్గం బాద పడుతున్నారు.

ఏవరేజ్ కంటెంట్ తో ఈ రెండు సినిమాలను టాప్ 5 లో కూర్చో పెట్టినందుకు ఇంకో మెగా అభిమాన వర్గం ఆనందోత్సవాలలో మునిగి తేలుతున్నారు.

నాకిష్టమైన సినిమాల కంటే అభిమానులకు మాస్ ప్రేక్షకులకు నచ్చే సినిమాలకే నా మొదటి ప్రిపరెన్స్ అని రామ్ చరణ్ అంటున్నాడు.

టాప్ స్థానానికి ఒకో మెట్టు ఎక్కుతూ వెళ్ళడం పద్దతి/ఆనవాయితీ. అదృష్టం కొలది మగధీర సినిమా మెట్లు లేకుండానే రామ్ చరణ్ ను టాప్ స్థానం లో కూర్చో పెట్టింది. రామ్ చరణ్ చేయవలసింది ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమే. రచ్చ , నాయక్ సినిమాలు మగధీరకు ధీటుగా లేకపోయినా, మగధీర ద్వారా వచ్చిన బాక్సాఫీస్ స్టామినా ను నిలబెట్టాయి. బాక్సాఫీస్ కంటే ముందు అభిమానులను అలరించాయి.

ఒక వర్గం మెగా అభిమానులు ఎందుకు భయ పడుతున్నారు?
నిజానికి ఇలా భయపడే వర్గం కూడా చాలా హ్యాపీగా వున్నారు. కారణం రచ్చ ద్వారా కొత్త దర్శకుడితో కూడా పెద్ద హిట్ కొడితే, నాయక్ ద్వారా పెద్ద దర్శకుడితో చేస్తూ రామ్ చరణ్ డామినేట్ చేసాడు. 25 సంవత్సరాల తర్వాత వచ్చిన మల్టీస్టారర్ మూవితో పోటి పడటమే కాదు, సింగిల్ గా ధీటుగా నిలబడ్డాడు. మెగా అభిమానుల భయం అంతా నాయక్ సినిమాలో డైజస్ట్ చేసుకోలేని వయలెన్స్ తగ్గించి, చిరంజీవి మాదిరి ఫ్యామిలీ/కిడ్స్ కూడా హ్యాపీగా చూసే సినిమాలు చెయ్యాలని వారి ఆరాటం.

Filed Under: Mega FamilyFeatured