నాయక్ Vs సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

nayak-svsc

దూకుడు , బిజినెస్ మెన్ సినిమాల విజయాలతో మంచి ఫామ్ లో వున్న మహేష్ బాబు .. ఫ్యామిలి హిరో వెంకటేష్ బాబు తోడయ్యి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్రెస్టెజియస్ ఫిలిం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.

మగధీర లాంటి సినిమా తర్వాత ఏ హిరోకైనా ఆ ఇమేజ్ నుంచి బయటకు రావడానికి పది సంవత్సరాలు పడతాది. కాని చరణ్ మాత్రం ‘రచ్చ’ సినిమా ద్వారా బయటకు వచ్చేసాడని చెప్పవచ్చు. ప్రతి సినిమా మగధీర లాంటి సినిమా కాదు, అటువంటి సినిమాలు చరిత్రలో అడపా దడపా వస్తుంటాయి. మగధీరను రీచ్ అవ్వాలని మానేసి మాస్ ప్రేక్షకులు, అభిమానులు ఏమి కోరుకుం టున్నారో అది అందించడం ముఖ్యం అని తెలుసుకున్నాడు.

రచ్చ కంటే బెటర్ కథ.రచ్చ కంటే బెటర్ డైరక్టర్.
రచ్చ కంటే బెటర్ సాంగ్స్ .. రచ్చను మించిన డాన్స్ ..
and so on .. నాయక్

పెద్ద హీరోలందరూ ఎక్కువ సినిమాలు చెయ్యడం .. సినిమా సీజన్స్ తక్కువ కావడం వలన ఈ రెండు భారీ సినిమాలు పోటి పడక తప్పడం లేదు.

me, must watch both movies for the following reasons:

  1. చరణ్ .. వినాయక్ కాంబినేషన్.
  2. మహేష్ బాబు. 25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం. ఎటువంటి అనుమానాలు లేకుండా ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగిన చిత్రం.

ఈ పండగకు ఈ రెండు సినిమాలూ మంచి టాక్ సంపాదించుకుంటాయనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదం పొందడంతో పాటు జేబులు ఖాళీ చేసుకోవడానికి మంచి అవకాశం.

Filed Under: Mega FamilyExtended FamilyFeatured