నాయక్ exclusive review

Screen Shot 2013-01-12 at 9.56.53 AM

నాయక్ సినిమా ఎలా వుంది?
బాగోలేదు అని అనలేము.
మనస్పూర్తిగా ‘చాలా బాగుంది’ అని అనలేము.
So, my exact answer is బాగానే వుంది.

మరి అంత సూపర్ హిట్ టాక్ ఏమిటి? ఆ కలక్షన్స్ వర్షం ఏమిటి?
సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.
కొత్తదనం ఏమి వుండదు, పక్కా మాస్ మూవీ అని ప్రేక్షకులకు ముందే తెలుసు.
మాస్ కు బాగా నచ్చుతుంది.
క్లాస్ కు మాస్ అనిపించినా, కథనం ఇంటరెస్ట్ గానే సాగుతుంది.

సినిమా ప్రత్యేకత ఏమిటి?
1) చరణ్.
2) వినాయక్ కేర్.

చరణ్ ఎలా చేసాడు?
ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఇమేజ్ ..
ఇంత చిన్న వయసులో సినిమాపై అన్ని ఎక్సపేటేషన్స్ ..
చిన్న వయసు అంటే చరణ్ వయసు మరియు చేసిన సినిమాల సంఖ్య ..
నాయక్ రోల్ కు 100% సూట్ అవ్వలేదు కాని .. బాగానే మేనేజ్ చేసాడు ..
ఈ సినిమా ‘చరణ్ ఈజ్ బిగ్’ అనే ఇమేజ్ బిల్డ్ చేస్తుంది ..

వినాయక్ ఎలా చేయించాడు?
మాస్ ప్రేక్షకులే టార్గెట్ గా చేసిన సినిమా .. ఎక్కడా డైవర్ట్ అవ్వలేదు ….
యాక్షన్ సిక్వెన్సస్ కొద్దిగా ఓవర్ అయినా చరణ్ చేత నటన చాలా కంట్రోల్డ్ గా చేయించాడు.
చాలా చోట్ల చరణ్ లో చిరంజీవిని చూపించాడు.

పాటలు, చరణ్ డాన్సస్ ఎలా వున్నాయి?
పాటలు టేకింగ్ పరంగా ఎక్సలెంట్ .. లొకేషన్స్ సెలక్షన్ అదుర్స్ ..
చిరంజీవి డాన్సస్ చూస్తున్నప్పుడు ఒక అభిమానిగా ఆనందంతో ఒళ్ళు జలదరించేది. ఇంచు మించు అదే ఫీలింగ్ క్రియేట్ చేసే స్థాయికి చేరుకుంటున్నాడు. భవిష్యత్తులో చిరంజీవి మ్యాజిక్ రిక్రియేట్ చేస్తాడనిపిస్తుంది.

bottomline:
రచ్చ కంటే బెటర్ మాస్ ప్రొడక్ట్ ‘నాయక్’ ..
చరణ్ మరీ వూర మాస్ pathలో వెళ్ళుతున్నాడా అని అనిపించినా, end of the day, కమర్షియల్ సక్సస్ మేటర్స్ అని సరిపెట్టుకొవాలి..

Filed Under: Mega FamilyFeaturedHari Reviews