నేటి తరం పెద్ద నిర్మాత బ్లాక్ బస్టర్ ‘బండ్ల గణేష్’

Iddarammayilatho 2nd week poster

సినిమాకు అయ్యే ఖర్చు భరించే వాడు నిర్మాత .. వివిధ రకాల నిర్మాతలు వుంటారు.

  1. తనకు నచ్చి, ప్రేక్షకులకు కావాల్సిన వినోదాత్మక సినిమా ఇచ్చి, తద్వారా డబ్బులు రాబట్టు కొవాలనుకునే నిర్మాతలు
  2. మన డబ్బులు మనకు తిరిగి వస్తాయా అని పూర్తి లెక్కలతో దిగే నిర్మాతలు
  3. మనం పెట్టిన డబ్బులు పోయినా పర్వాలేదు .. సినిమా చరిత్రలో మన సినిమాకు ఒక పేజి ఉండాలనుకునే నిర్మాతలు

పైన చెప్పుకోబడిన నిర్మాతలు ఒకటి రెండు సినిమాలు తీసి అలిసిపోయి చేతులేత్తేయడమో, లేకపోతే అడపా దడపా సినిమాలు చేస్తుంటారు. మనకు సరిపడే వాతావరణం లేదని సినిమాలు తీయడం మానేసిన నిర్మాతలు కూడా చాలా మంది వున్నారు.

మన తెలుగు సినిమా మొదట సేల్ పాయింట్ ‘హిరో’. ఆ ‘హిరో’ కు ఎంత మంచి కాంబినేషన్ సెట్ చేస్తే, ఆ సినిమాపై అంత హైప్ వస్తుంది. దర్శకుడు, మ్యూజిక్, రిచ్ లుక్ అండ్ సో ఆన్.

నేటి తరం పెద్ద నిర్మాత బ్లాక్ బస్టర్ ‘బండ్ల గణేష్’ అనడానికి అదే కారణం. హీరోకు సెట్ అయ్యే కాంబినేషన్స్ అన్నీ సెట్ చేసుకొని, హిరో దగ్గరకు వెళ్ళుతున్నాడు అంతే. హిరో రేంజ్ కు తగ్గట్టు రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నాడు. చచ్చినట్టు హిరో డేట్స్ ఇవ్వాల్సిందే. నో అనడానికి రీజన్ లేదు.

Request to Blockbuster Bandla Ganesh:
ఇదే ఊపులో ‘పవన్ కళ్యాణ్ – రాజమౌళి’ సెట్ చేసేయ్ బాబు .. నీ జన్మ & మా జన్మ ధన్యమై పోతుంది ..

Filed Under: Pawan KalyanFeatured