కొత్త తప్పులు

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

వరసగా ఐదు హిట్స్ ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ ది. సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి మరియు ఖుషీ. ఈ విజయాలు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో జానీ సినిమా స్వీయా దర్శకత్వం లో చెయ్యడం, ఒక పెద్ద ఫ్లాఫ్ గా నిలవడం జరిగింది. ఆ సినిమాలో మీరు చేసిన తప్పులు సరిదిద్దుకొని మరో సినిమా ఎప్పుడు చేస్తారు అని పవన్ కళ్యాన్ ను అడిగితే “జానీ సినిమా ప్రేక్షకులకి రీచ్ అవ్వడంలో చాలా పొరబాట్లు జరిగిన మాట వాస్తవమే. కొత్త సినిమా చేస్తే కొత్త పొరబాట్లు చేస్తాం. ఎవరైనా చేయగల్గేది నిజాయితీతో కూడిన ప్రయత్నమే. నేను జానీ సినిమాలో అది మిస్ అవ్వలేదు. నా ఏ సినిమాకు కూడా మిస్ అవ్వను ” అని సమాధానం చెప్పాడు.

“ఒక ప్రయత్నంలో ఎన్ని పాత తప్పులు సరిదిద్దుకున్నా కొత్త తప్పులు చేస్తూ వుంటాం. నిజాయితీతో కూడిన ప్రయత్నం మాత్రం మిస్ అవ్వ కూడదు.” అంటున్న పవన్ కళ్యాణ్ ఫిలాసిఫీ నాకు బాగా నచ్చింది.

Filed Under: Pawan Kalyan