Next: శ్రీనువైట్ల

Ram-Charan-Srinu-Vaitla

కమర్షియల్ ఎలిమెంట్స్‌కు రెండో స్థానం కల్పించి, పూర్వకాలపు పల్లెటూరు మానవ సంబంధాలకు పెద్ద పీట వేసి ప్రేక్షకుల మనసులను తప్పకుండా దోచుకుంటాం అని ఎంతో నమ్మకం చేసిన సినిమా గోవిందుడు అందరివాడేలే. ఏ నమ్మకంతో అయితే ఈ సినిమాను తీసారో అదే నమ్మకంతో హిరో & దర్శకులు పొస్ట్ రిలీజ్ పబ్లిసిటీ చెయ్యడం ఈ సినిమా రిజలృ్‌కు కచ్చితంగా ప్లస్. మరికొంత పబ్లిసిటీతో 30 కోట్లతో ఆగిపోతుందా, ’40’ ’50’ కోట్లు చేస్తుందా, 60 కోట్లు రీచ్ అవుతుందనే చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టి, డీసెంట్ హిట్ గా ఎండ్ అవ్వచ్చు. పాటల్లానే స్లోగా హిట్ టాక్ సొంతం చేసుకొవడానికి ఛాన్సస్ వున్నాయి.

చిరంజీవి వారసుడిగా పుట్టడం ఎంత అదృష్టమో , చిరంజీవి ఇమేజ్‌ను కంటిన్యూ చెయ్యడం ఎంతో బాద్యత కూడా. రామ్‌చరణ్ తన శాయశక్తులా కష్టపడుతున్నాడు. ప్రతి అడుగు ఆచి తూచి వేస్తున్నాడు.

రామ్‌చరణ్‌కు నెక్స్ట్ సినిమా శ్రీనువైట్లతో చెయ్యాలని వుంది. రామ్‌చరణ్ మెప్పించే కథ శ్రీనువైట్ల ఇవ్వగల్గితే రామ్‌చరణ్ నెక్స్ట్ మూవీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లోనే.

ఆగడు ఫ్లాప్‌తో 1) శ్రీనువైట్ల సేమ్ టెంప్లేట్ వాడుతాడు 2) సొంత సినిమా వాళ్ళపైనే వెటకారం చేస్తాడు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రామ్‌చరణ్ కామెడీ టైమింగ్ ను ఇంకా పికప్ చెయ్యలేదు. పవన్‌కల్యాణ్ మహేష్‌బాబు & అల్లు అర్జున్ మాదిరి ఓవర్‌యాక్షన్ చెయ్యలేడు. అలా అని మొత్తం సినిమా వినాయక్ ‘నాయక్’ మాదిరి కామీడియన్స్ మీద నడిపిస్తానంటే కుదరదు.

సొంత సినిమా వాళ్ళపై వెటకారం లేకుండా, ప్రేక్షకులు విసిగి పోయిన సేమ్ టెంప్లేట్ లేకుండా .. శ్రీనువైట్ల చరణ్‌తో సినిమా వుంటుందా లేదా అనే దానికోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Filed Under: Mega FamilyFeatured