మరోసారి పొటీ పడనున్న మహేష్ & చరణ్ సినిమాలు

మరోసారి పొటీ తప్పేట్టు లేదు

మరోసారి పొటీ తప్పేట్టు లేదు

మహేష్ నెక్స్ట్ మూవీ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఆగష్టుకి రెడీ. కాని, పండగ సీజన్ కోసం సెప్టెంబర్ చివరి వారం వరకు వెయిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రామ్‌చరణ్ నెక్స్ట్ మూవీ ఇప్పుడే మొదలైంది. నాన్‌స్టాఫ్ గా పనిచేస్తే సెప్టెంబర్ చివరి వారం రిలీజ్ అవ్వోచ్చు.

ఈ లెక్క ప్రకారం కచ్చితంగా మహేష్ & చరణ్ సినిమాలు మరోసారి పొటీ పడనున్నట్టే.

నాయక్ & సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు పోటి పడినపుడు చరణ్‌కు వి.వి. వినాయక్, మహేష్‌కు సపోర్ట్‌గా దిల్ రాజు వున్నారు.

ఎవడు & 1 సినిమాలు పోటి పడినపుడు చరణ్‌కు సపోర్ట్‌గా దిల్ రాజు వున్నా, మహేష్‌కు సపోర్ట్‌గా 24 ఫ్రేమ్ నిర్మాతలు నిలబడి ఎక్కువ ధియేటర్స్ రాబట్టుకోగల్గారు.

ఇప్పుడు మహేష్ & చరణ్ సినిమాల పొటీల్లో మహేష్‌బాబుకు 24 ఫ్రేమ్ నిర్మాతలతో పాటు ప్రేక్షకులు ఆశీంచే ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీగా ఇవ్వగల దర్శకుడు శ్రీనువైట్ల తోడయ్యాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

చరణ్ సినిమా ఫినిష్ అయ్యేటప్పటికి కృష్ణవంశీ & బ్లాక్‌బస్టర్ బండ్లగణేష్ లు చరణ్‌కు తోడయ్యి సినిమాపై అంచనాలు ఏ విధంగా పెంచుతారో చూడాలి.

Filed Under: Extended FamilyFeatured