రాజమౌళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ బాబు

rajamouli-mahesh-babu

వార్త 1:
నాగార్జున తనతో సినిమా చెయ్యమని డైరక్ట్ గా అడిగినా, రాజమౌళి తన నవ్వుతోనే సరిపెట్టాడు తప్ప, కమిట్ మాత్రం అవ్వలేదు.

వార్త 2:
బాలకృష్ణ అభిమానులు బాలకృష్ణ 100వ చిత్రం, చిరంజీవి అభిమానులు చిరంజీవి 150వ చిత్రం రాజమౌళి చెయ్యాలని అడిగినపుడు .. ఆ హీరోలతో చెయ్యడం ఇప్పుడు నాకు అంత కంఫర్టబుల్ కాదు అని డైరక్ట్ గా చెప్పాడు.

వార్త 3:
ఎన్.టి.ఆర్ తనతో సినిమా చెయ్యమని ప్రతి ఆడియో ఫంక్షన్ లో సరదాగా చేసే కామెంట్స్ కు ‘ఎన్.టి.ఆర్ తో హిట్ సినిమా కంటే ఎన్.టి.ఆర్ కు డిఫరెంట్ ఇమేజ్ సెట్ చేసే సినిమా అవసరం’ అని తప్పించుకున్నాడు.

వార్త 4:
రాజమౌళిని పొగడటానికి రాజమౌళి “ఊ” అనాలే కాని, ఏ హిరో అయినా ఎగిరి గంతేసుకొని చేసేస్తాడని మన మీడియాలో చెపుతూ వుంటారు. కాని అది నిజం కాదు.

——————————-
పవన్ కళ్యాన్ మహేష్ బాబులు హిట్ డైరక్టర్స్ వెంట పడిన సందర్భాలు లేవు.తమతో ట్యూన్ అయ్యే దర్శకులతోనే చేస్తారు. వారికి దర్శకుడు చెప్పే కథ కంటే ముందు దర్శకుడు నచ్చాలి.

So .. వారు తన దగ్గరకు రారు కాబట్టి, రాజమౌళి వీరద్దరితో చెయ్యాలన్న ఆకాంక్షను బహిరంగంగానే చెప్పాడు.

పవన్ కల్యాన్ ను కలవడానికి పంజా సెట్స్ వెళ్ళాడు కాని, కుదరలేదు. మహేష్ బాబు తో మాత్రం లంచ్ చేసి, ఒక కథ వినిపించినట్టుగా ఆ మధ్య తన ట్విటర్ లో చెప్పాడు, కాని మహేష్ బాబు రెస్పాన్స్ ఏమిటనేది మాత్రం అప్పుడు చెప్పలేదు.

మొన్న ప్రెస్ మీట్ లో మహేష్ బాబు తాను చేయబోయే సినిమాలో రాజమౌళి సినిమా ఒకటి అని చెప్పడం ద్వారా రాజమౌళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. బహుబలి తర్వాత రాజమౌళి చేయబోయే సినిమాకు హిరో ఎవరు అనే సస్పెన్స్ కు తెరపడింది.

రాజమౌళినే ఒక నిర్మాతను సెట్ చేసుకొని మహేష్ బాబు సినిమా చేస్తాడో,
మహేష్ బాబు నిర్మాతను సెట్ చేసి రాజమౌళిని చెయ్యమంటాడో
ఇంకా తెలియవలసి వుంది.

Filed Under: Extended FamilyFeatured