2014లో పవన్‌కల్యాణ్ సినిమా రిలీజ్ లేనట్టే

పవన్‌కల్యాణ్

పవన్‌కల్యాణ్

పవన్‌కల్యాణ్ గత ఐదు సినిమాలు 1) తీన్‌మార్, 2) పంజా, 3) గబ్బర్‌సింగ్, 4) కెమెరామేన్ గంగతో రాంబాబు & 5) అత్తారింటికి దారేది –> అసలు గ్యాప్ ఇవ్వకుండా నటించాడు. గబ్బర్‌సింగ్-2 అదే ఊపులో చేసేయాలని ప్లాన్ చేసాడు కాని, ఎందుకో వర్కవుట్ కాలేదు.

అత్తారింటికి దారేది సినిమాకు క్లాప్ కొట్టిన దగ్గర నుండి సంపత్‌నంది గబ్బర్‌సింగ్-2 సబ్జక్ట్ ప్రిపేర్ చేసే పనిలో పడ్డాడు కాని, ఇంకా రెడీ అవ్వలేదు. ఏప్రిల్‌లో మొదలవుతుంది అనేది కొందరి ఊహాగానాలే తప్ప ఎప్పుడనేది ఎవరికీ తెలియదు.

ఏప్రిల్‌ల్లో మొదలు పెట్టి, సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయగల్గుతారా అనేది డౌటే.

అంత కష్టపడి సినిమా చేసి అన్ సీజన్ నవంబర్ లోనో లేదా డిసెంబర్ లోనో సినిమా రిలీజ్ చేసేంత సాహసం చేస్తే తప్ప, 2014లో పవన్‌కల్యాణ్ సినిమా రిలీజ్ లేనట్టే.

Filed Under: Pawan KalyanFeatured